పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వరుసగా సినిమాలు చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమాలు అన్నింటిలో కూడా మలయాళంలో సూపర్ హిట్ గా నిలిచిన అయ్యప్పనుం కోషియుం సినిమా రీమేక్ మాత్రం అన్నిటికంటే ఆసక్తి రేకెత్తిస్తోంది. సాగర్ కే చంద్ర దర్శకత్వంలో త్రివిక్రమ్ రచన సహకారం అందిస్తున్న ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ - రానా దగ్గుబాటి ఇద్దరు ప్రత్యర్థులుగా కనిపిస్తున్నారు. 


అయితే ఈ సినిమాకు సంబంధించి తాజాగా రోజుకు ఒక అప్డేట్ ఇస్తూ వస్తోంది చిత్ర యూనిట్. తాజా అప్డేట్ ప్రకారం ఈ సినిమా సంక్రాంతికి రిలీజ్ అవుతుంది. ఇక ఈమేరకు ప్రకటన చేస్తూ ఒక చిన్నపాటి మేకింగ్ వీడియో కూడా కొద్ది సేపటి క్రితం విడుదల చేశారు చిత్ర యూనిట్. ఈ వీడియోలో విజువల్స్ ఆసక్తికరంగా ఉన్నాయి. ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా చూసేయండి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి: