క్రికెటర్ విరాట్‌ కోహ్లీకి ఏఎస్‌సీఐ సంస్థ నోటీసులు ఇవ్వబోతోంది. ఏఎస్‌సీఐ అంటే అడ్వర్ట్‌జింగ్‌ స్టాండర్డ్స్‌ కౌన్సిల్ ఆఫ్ ఇండియా సంస్థ.. ప్రజలను తప్పుదోవ పట్టించే యాడ్స్ గురించి ఈ సంస్థ చర్యలు తీసుకుంటుంది. ఇంతకీ ఈ సంస్థ విరాట్‌ కోహ్లీకి ఎందుకు నోటీసు ఇస్తుందటంటే.. విరాట్ కోహ్లీ కొన్ని రోజులుగా లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్శిటీని తన సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్ పై ప్రమోట్‌ చేస్తున్నాడు.


లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్శిటీని ప్రమోట్ చేస్తూ విరాట్‌ కోహ్లీ పోస్టులు పెడుతున్నాడు. ఇది ఏఎస్‌సీఐ నిబంధనలకు విరుద్దమని ఆ సంస్థ అభిప్రాయపడుతోంది. అందుకే ఈ విషయమై విరాట్ కోహ్లీని వివరణ కోరతామని ఆ సంస్థ తెలిపింది. ఇటీవల సెలబ్రెటీలు ఇలా చాలా మంది చేస్తున్నారు. అయితే తమ దృష్టికి వచ్చిన వాటిపై ఏఎస్‌సీఐ సంస్థ చర్యలు తీసుకుంటుంది. మరి ఏఎస్‌సీఐ నోటీసులు ఇస్తే కోహ్లీ ఏం సమాధానం చెబుతాడు.. దీనిపై ఆ సంస్థ ఎలాంటి చర్యలు తీసుకుంటుందన్నది ఆసక్తికరంగా మారింది.  


మరింత సమాచారం తెలుసుకోండి: