గులాబ్ తుఫాన్ ప్రభావం తో రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు భారీ వర్షాలు ప్రజలకు చుక్కలు చూపిస్తున్నాయి. ప్రజలు అందరూ కూడా బయటకు రాకుండా జాగ్రత్తగా ఉండాని గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో అధికారులు హెచ్చరికలు కూడా చేసిన సంగతి తెలిసిందే. తెలంగాణా వ్యాప్తంగా భారీ వర్షాలు పడుతున్న నేపధ్యంలో రాష్ట్ర యంత్రాంగం పూర్తిగా చర్యలు చేపట్టింది. రాష్ట్రంలో 14 జిల్లాల్లో రెడ్‌ అలర్ట్‌ ప్రకటించింది వాతావరణశాఖ.

నిర్మల్, నిజామాబాద్, కామారెడ్డి జిల్లాలకు రెడ్‌ అలర్ట్‌ ఇచ్చింది. అలాగే జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, సిద్దిపేట జిల్లాలకు రెడ్‌ అలర్ట్‌, పెద్దపల్లి, కరీంనగర్, జనగామ, జిల్లాలకు రెడ్‌ అలర్ట్‌ ప్రకటించారు. వాటి తో పాటుగా వరంగల్, హన్మకొండ, మహబూబాబాద్ జిల్లాలకు రెడ్‌ అలర్ట్‌ ప్రకటించారు. ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలకు రెడ్ అలర్ట్ ప్రకటించి అధికారులు అలెర్ట్ గా ఉండాలని సూచించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

ts