హైదరారాబాద్‌లోని రాజ్‌ భవన్‌లో ఉగాది ఉత్సవాలు జరిగాయి. ఈ ఉత్సవాల్లో గవర్నర్ ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ వేడుకలకు అనేక మంది ప్రముఖులు హాజరయ్యారు. అధికార పార్టీకి చెందిన సీఎం, ఇతర మంత్రులు మాత్రం హాజరు కాలేదు. విపక్ష నేతలు రేవంత్ రెడ్డి, రఘునందన్ రావు, ఈటల రాజేందర్, మాజీ గవర్నర్ విద్యాసాగర్ రావు సహా అనేక మంది నేతలు రాజ్‌భవన్‌కు వచ్చారు.


అయితే.. ఈ కార్యక్రమంలో ఓ అపశ్రుతి దొర్లింది. రాజ్‌  భవన్‌లో స్టేజి కింద ప్రముఖుల దగ్గర గవర్నర్ కూర్చొనే కుర్చీ పక్కకు జరగడంతో అనుకోకుండా గవర్నర్ కింద పడిపోయారు. అయితే తక్షణమే తేరుకున్న గవర్నర్.. చటుక్కున లేచి తేరుకొని అదే కుర్చీలో కుర్చున్నారు. కనీస జాగ్రత్తలు తీసుకోని తన వ్యక్తిగత సిబ్బంది పై గవర్నర్ తమిళి సై సీరియస్ అయ్యారు. ఈ కార్యక్రమానికి అధికార పార్టీ పెద్దలంతా దూరంగా ఉండటం చర్చనీయాంశం అయ్యింది.


మరింత సమాచారం తెలుసుకోండి: