పాకిస్తాన్‌కు అఫ్గానిస్తాన్‌ మరోసారి వార్నింగ్ ఇచ్చింది. తమ భూభాగాల దురాక్రమణకు పాల్పడితే సహించేది లేదని తాలిబన్లు మళ్లీ పాక్‌ను హెచ్చరించారు. తమ ప్రాంతాలపై మరోసారి వైమానిక దాడులు జరిగితే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని అఫ్గాన్‌ రక్షణ మంత్రి ముల్లా మొహమ్మద్‌ యాకూబ్‌ వార్నింగ్ ఇచ్చారు. అఫ్గాన్‌లోని కునార్‌, ఖోస్త్‌ ప్రావిన్సుల్లో పాకిస్తాన్‌ ఈనెల 16న వైమానిక దాడులు జరిపింది. పాకిస్థానీ సైనిక హెలికాప్టర్‌ జరిపిన ఈ ఘటనలో 36 మంది అఫ్గాన్లు  ప్రాణాలు కోల్పోయారు. అంతే కాదు.. ఈ దాడుల్లో.. 20 మంది చిన్నారులు మరణించారు. ఈ విషయాన్ని ఐక్య రాజ్య సమితి కూడా ధ్రువీకరించింది. పాకిస్తాన్, అఫ్గానిస్తాన్ మధ్య సరిహద్దుల విషయంలో చాలా ఏళ్లుగా ప్రతిష్టంభన కొనసాగుతోంది. ఈ నేపథ్యంలోనే పాక్, అఫ్గాన్ సరిహద్దుల  వెంబడి ఉద్రిక్తతలు తరచూ చోటు చేసుకుంటున్నాయి. మరి ఈ ఉద్రిక్తతలు ఎక్కడకు దారి తీస్తాయో?

మరింత సమాచారం తెలుసుకోండి: