సముద్రంలో వేటకు వెళ్లి బోటు చెడిపోవడంతో వల్ల మచిలీపట్నం ప్రాంతానికి చెందిన నలుగురు మత్య్సకారుల ఆచూకీ లేకుండా పోయారు. వారి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. వేట కోసం ఈ నెల 2వ తేదిన  బోటు పై సముద్రంలోకి వీరు వెళ్లారు. మరుసటి రోజు సాయంత్రం అంతర్వేది సమీపంలో బోటు పడైపొయిందంటూ బోటు యజమానికి ఫోన్ ద్వారా సమాచారం ఇచ్చారు.


అయితే..  మరో బోటులో వారిని తీసుకువచ్చేందుకు వెళ్లిన వారికి వారి ఆచూకీ దొరకలేదు. ఛార్జింగ్‌ లేక ఫోన్‌ స్విచ్చాఫ్ అయ్యింది. అధికారులు సంప్రదించేందుకు అవకాశం లేకుండా పొయింది. ఈ విషయాన్ని మాజీ మంత్రి పేర్నినాని సీఎంవో కార్యలయంతో పాటు హోం మంత్రి దృష్టికి తీసుకువెళ్లారు. నేవి,పోస్ట్ గార్డ్ ,మైరెన్ బృందాలు  రెండు బోట్లు, ఒక చాపర్ ద్వారా గాలింపు కొనసాగిస్తున్నాయి. ఆచూకీ లేని వారి కుటుంబలను స్థానిక నాయకులు కలిసి ధైర్యం చెబుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: