హైదరాబాద్‌ నగరం రోజురోజుకూ విస్తరిస్తోంది. సుస్థిర ప్రభుత్వం... అభివృద్ధి కారణంగా హైదరాబాద్‌లో ఇళ్లకు డిమాండ్ పెరిగింది. చాలా మంది ఇతర ప్రాంతాల వారు కూడా ఇక్కడ పెట్టుబడులు పెడుతున్నారు. ఇళ్లు, ఫ్లాట్లపైనా పెట్టుబడులు పెడుతున్నారు. అందుకే హైదరాబాద్‌లో ప్లాట్లు, ఫ్లాట్ల రేట్లు ఏటా పెరుగుతూనే ఉన్నాయి.

అయితే ఈ పెరుగదల అన్ని చోట్లా ఒకలాగానే లేదు.. కొన్ని ప్రాంతాల్లో చాలా ఎక్కువగా మరికొన్ని ప్రాంతాల్లో ఒక మాదిరిగా ఉంది. మరి ఎక్కడ ఎక్కువగా రేట్లు పెరుగుతున్నాయంటే..  హైదరాబాద్‌లో ఘట్‌కేసర్‌, ఆదిభట్ల, మేడ్చల్‌లలో రేట్లు బాగా పెరుగుతున్నాయి. ఇక్కడ  ప్లాట్‌ సగటు ధరలు  బాగా పెరుగుతున్నాయి. ఘట్‌ కేసర్‌లో 26 శాతం, ఆదిభట్లలో 24 శాతం, మేడ్చల్‌లో 21 శాతం రేట్లు వృద్ధి చెందినట్టు  రియల్‌ ఎస్టేట్‌ కన్సల్టెంట్‌ సంస్థ అనరాక్‌ నివేదిక చెబుతోంది. మరి ఇంకేం.. అవకాశం ఉంటే మీరూ ఓ ప్లాట్‌ కొనేయండి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి: