
మహిళా ఐఏఎస్‌ను అవమానించడం బాధాకరమని స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి ఉషాశ్రీ చరణ్ అన్నారు. జేసీ ప్రభాకర్‌రెడ్డి వెంటనే కలెక్టర్‌కు క్షమాపణ చెప్పాలని స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి ఉషాశ్రీ చరణ్ డిమాండ్ చేశారు. అనంతపురం కలెక్టరేట్లో టీడీపీ నేత జేసీ ప్రభాకర్‌రెడ్డి ప్రవర్తనపై మంత్రి ఉషాశ్రీచరణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. స్పందన కార్యక్రమం నేపథ్యంలో అర్జీ ఇవ్వడానికి కలెక్టరేట్‌కు వచ్చిన జేసీ ప్రభాకర్‌రెడ్డి కలెక్టర్‌పై దురుసుగా ప్రవర్తించారని ఆమె తెలిపారు. ఆమెను అవమానించేలా మాట్లాడారని వివరించారు. కలెక్టర్ నాగలక్ష్మిపై జేసీ ప్రభాకర్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలు చాలా దురదృష్టకరమని అన్నారు. కలెక్టర్ నాగలక్ష్మికి టీడీపీ నేత జేసీ ప్రభాకర్‌రెడ్డి బహిరంగ క్షమాపణ చెప్పాలన్నారు.