ఈ రోజుల్లో పుస్తక పఠనం తగ్గిపోయింది. మనిషి జీవితం అంతా మొబైల్ చుటూ తిరుగుతోంది. అయితే.. ప్రతి మనిషి అక్షరానికి దగ్గర ఉంటే జీవితానికి దగ్గరగా ఉంటారని అంటున్నారు ఏపీ గ్రంథాలయ పరిషత్ చైర్మన్ శేషగిరిరావు. 55వ గ్రంథాలయ జాతీయ వారోత్సవాల సందర్భంగా విజయవాడలోని బుక్ ఫెస్టివల్ సోసైటి హల్ పుస్తక పఠనం- అవశ్యకత- గ్రంథాలయాల పాత్ర అనే అంశంపై చర్చ నిర్వహించారు. గ్రంథాలయ శాఖలో సాంకేతికతను అమలు చేసే విధంగా ముందడుగు వేస్తున్నామని ఏపీ గ్రంథాలయ పరిషత్ చైర్మన్ శేషగిరిరావు చెబుతున్నారు.


నూతన పుస్తకాల కొనుగోలతో పాటు, గ్రంథాలయల అభివృద్దికి నిధులు కేటాయించడం జరుగుతుందని ఏపీ గ్రంథాలయ పరిషత్ చైర్మన్ శేషగిరిరావు అన్నారు. ప్రజలకు మళ్లీ పుస్తకాలను దగ్గర చేయాలన్న లక్ష్యంతో ప్రభుత్వం పని చేస్తుందన్నారు. గతంలో సమాజంలో గ్రంథాలయలకు అధిక ప్రాధాన్యత ఉండేదని వక్తలు గుర్తు చేసుకున్నారు. ప్రజల్లో గ్రంథాలయాపై మక్కువ పెంచేందుకు ప్రభుత్వం గ్రంథాలయ వారోత్సవాలు నిర్వహించడం అభినందనీయం.

మరింత సమాచారం తెలుసుకోండి: