తెలంగాణలో ఉద్యోగాల జాతర మొదలైంది. ఇప్పటికే గ్రూప్ 1తో పాటు పోలీస్‌ ఉద్యోగాల నియమాక ప్రక్రియ సాగుతోంది. ఇటీవలే 9 వేలతో గ్రూప్‌4 పోస్టులకు ప్రకటన వచ్చింది. ఇక గ్రూప్ 2, 3, 4 కూడా రాబోతున్నాయి. అయితే.. పోస్టుల సంఖ్య పెంచాలంటున్నారు కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి.. ఉద్యోగాల భర్తీ ప్రక్రియ మొదలైందని.. తెలంగాణలో25 లక్షల మంది నిరుద్యోగులు ఉన్నారని కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి అన్నారు.

టీచర్ పోస్టులు ఎక్కువ ఖాళీగా ఉన్నాయన్న కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి... టీచర్ పోస్టుల సంఖ్య పెంచాలని.. 32 వేల టీచర్ పోస్టులు త్వరగా భర్తీ చేయాలని అన్నారు. సీఎం కేసీఆర్ కి లేఖ కూడా రాస్తున్నానని.. 10 వేల మందికి ప్రమోషన్ ఆగిపోయాయని.. ప్రమోషన్ లు ఇస్తే పోస్టుల ఖాళీలు ఏర్పడతాయని అన్నారు. సీఎం వెంటనే దీనిపై చర్యలు తీసుకోవాలన్న కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి.. టీఆర్‌ఎస్‌, బీజేపీ రెండు ఒకరికి ఒకరు దొంగలు అనుకుంటున్నారని వ్యాఖ్యానించారు.


మరింత సమాచారం తెలుసుకోండి: