తెలంగాణ ఆర్టీసీ లాజిస్టిక్స్ రంగంలో విప్లవాత్మక మార్పుల వస్తున్న నేపథ్యంలో వినియోగదారులకు కార్గో సేవలు మరింత చేరువ చేయనుంది. హైదరాబాద్ ఆర్టీసీ బస్‌ భవన్‌లో "AM 2 PM" పేరిట ఎక్స్‌ప్రెస్ పార్శిల్ సర్వీసును టీఎస్‌ ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జన్నార్‌ ప్రారంభించారు. రాష్ట్రంలో వినూత్న రీతిలో 2020 జూన్‌ 19వ తేదీన ప్రవేశపెట్టిన ఆర్టీసీ కార్గో సేవలు ద్వారా చక్కటి సత్ఫలితాలు లభిస్తున్నాయి. తాజాగా మధ్యాహ్నం 12 గంటల లోపు పార్శిల్‌ బుక్ చేస్తే రాత్రి 9 గంటల్లోగా అది వినియోగదారులకు ఇంటి ముంగిటికే వెళుతుందని టీఎస్‌ ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జన్నార్‌ అన్నారు.


ఒక కిలో బరువు పార్శిల్.. అదీ సింగిల్ ప్యాక్‌ మాత్రమే ఎక్స్‌ప్రెస్ పార్శిల్ ద్వారా వెళితే... కేవలం 90 రూపాయలు మాత్రమే రుసుం వసూలు చేస్తారని టీఎస్‌ ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జన్నార్‌ అన్నారు.  ఇప్పటికే 5 కిలోల బరువు పార్శిల్ కోసం డిమాండ్ వస్తుందని త్వరలో అది కూడా  ప్రవేశపెడతామని టీఎస్‌ ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జన్నార్‌ అన్నారు. తిరుపతి, విశాఖపట్నం, బెంగళూరు వంటి నగరాలకు కూడా ఈ సేవలు అందిస్తామని టీఎస్‌ ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జన్నార్‌ స్పష్టం చేశారు.


మరింత సమాచారం తెలుసుకోండి: