జగన్‌ పాలనలో 3,372 మంది మహిళలపై అత్యాచారాల జరిగాయని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌..తణుకు సభలో విమర్శించారు. మహిళలపై అత్యాచారాలు జరుగుతుంటే మహిళా మంత్రులు ఏం చేస్తున్నారని జనసేన అధినేత పవన్‌ అడిగారు. పాక్‌, అఫ్గాన్‌ నుంచి వచ్చిన రూ.72 వేల కోట్ల హెరాయిన్‌ బాంద్రా పోర్టులో దొరికిందన్న పవన్‌.. రూ.72 వేల కోట్ల హెరాయిన్‌ చిరునామా విజయవాడలో ఉందన్నారు. స్మగ్లింగ్‌ ఇన్‌ ఇండియా రిపోర్టులో ఏపీ నుంచి అత్యధికంగా గంజాయి స్మగ్లింగ్‌ జరుగుతోందని తేలిందని.. బిహార్‌లో నేరాలు తగ్గి ఆంధ్రాలో పెంచేలా జగన్ చేశారని జనసేన అధినేత పవన్‌ విమర్శించారు.
 
క్రిమినల్స్‌ రాజ్యాలు ఏలితే నేరాలు పెరగక అభివృద్ధి ఉంటుందా అని ప్రశ్నించిన జనసేన అధినేత పవన్‌.. జగన్ రూ.8 వేల కోట్ల ప్రైవేటు ఆస్తులను దోచేశారన్నారు. వైసీపీ నేతల దోపిడీ భరించలేక పారిశ్రామికవేత్తలు పారిపోయే పరిస్థితి ఉందన్న జనసేన అధినేత పవన్‌.. ఆస్తులు దోచుకోవడం మీకు ఇవాళే అలవాటు కాలేదని ఎప్పటి నుంచో ఉందని  అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: