నాగార్జున సాగర్ జలాల విడుదల విషయంలో నవంబర్ 28 వ తేదీకి ముందు ఉన్న పరిస్థితిని కొనసాగిస్తూ సి.ఆర్.పీ.ఎఫ్ దళాల పర్యవేక్షణకు అప్పగించాలని కేంద్రం నిర్ణయించింది.  కేంద్ర హోమ్ శాఖ కార్యదర్శి చేసిన ఈ ప్రతిపాదనకు తెలంగాణా, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాలు కూడా అంగీకరించాయి. నాగార్జున సాగర్ డ్యామ్ నుండి నవంబర్ 29 న ఆంధ్ర ప్రదేశ్  ఏకపక్షంగా సాయుధ దళాలను మోహరించి కుడి కాలువ ద్వారా నీటిని విడుదల చేసిన సందర్బంగా తలెత్తిన వివాదంపై కేంద్ర హోమ్ శాఖ కార్యదర్శి అజయ్ కుమార్ భల్లా తెలంగాణ, ఆంద్ర ప్రదేశ్ రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు, డీజీపీ లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.

నాగార్జున సాగర్ డ్యాం పై గతంలో ఉన్న మాదిరిగానే స్టేటస్-కో కొనసాగించాలని,  ఈ డ్యామ్ ను తాత్కాలికంగా కేంద్ర రిజర్వ్ పోలీస్ దళాల పర్యవేక్షణలో ఉంటుందని కేంద్ర హోమ్ శాఖ కార్యదర్శి భల్లా పేర్కొన్నారు. ఈ అంశంపై కేంద్ర జల వనరుల శాఖ కార్యదర్శి ఆధ్వర్యంలో ప్రత్యేక సమావేశం నిర్వహించబోతున్నట్లు భల్లా తెలిపారు.


మరింత సమాచారం తెలుసుకోండి: