ఈ సారి ఏపీ ఎన్నికలు ఏ రేంజ్ లో సాగాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. గత రెండు నెలలుగా నువ్వా-నేనా అన్నట్లు అధికార వైసీపీ, ఇటు ప్రతిపక్ష కూటమి హోరాహోరీగా ప్రచారం చేశాయి. ఎవరికి వారు తమ ప్రచార వ్యూహాలతో ఓటర్ల  మనసు దోచుకునే ప్రయత్నం చేశారు. జగన్ సంక్షేమ పథకాలతో ఎన్నికలకు వెళ్తే.. చంద్రబాబు మాత్రం అభివృద్ధి, సంక్షేమం, రాజధాని అంశాలతో వెళ్లారు.

అయితే ఈ ఎన్నికల్లో కీలక అంశంగా రాజధాని మారింది. కూటమి అధికారంలోకి వస్తే అమరావతే రాజధాని అని చంద్రబాబు ప్రకటించగా.. వైసీపీ వస్తే మూడు రాజధానులు విధానాన్ని అమలు చేయనుంది. ప్రజలు మరీ దేనిని కోరుకున్నారు అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. వాస్తవంగా ఈ ఎన్నికల్లో ఇది కీలక అంశంగా మారి ఓటర్లను ప్రభావితం చేసిందా అంటే లేదనే సమాధానమే ఎక్కువగా వినిపిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: