కరోనా సంక్షోభం అనంతరం దేశంలో నిరుద్యోగ సమస్య తీవ్రంగా పెరిగిపోయింది. దానిని అరికట్టడానికి కేంద్రం చర్యలు తీసుకుంటుంది. సాధారణంగా ఉద్యోగాలు అంటే అయితే ప్రభుత్వ నోటిఫికెషన్స్ ద్వారా లేదా కొత్త పరిశ్రమల స్థాపన ద్వారా మాత్రమే వస్తుంటాయి. ప్రభుత్వ ఉద్యోగాలపై ఆశలు ఇంకా ఎక్కడ ఉంటాయి, కేంద్రంలో బీజేపీ వచ్చిన వెంటనే కోటి ఉద్యోగాలు అన్నారు, ఇంతవరకు లేకపోగా ఆయా సంస్థల ప్రైవేటీకరణ తో ఉన్నవి లాగేసుకుంటున్నారు. ఇప్పుడిప్పుడే కాస్త తగ్గుముఖం పడుతున్న కరోనా తో ఆర్థికపురోగతి కోసం కేంద్రం చర్యలు చేపడుతుంది. అందుకే దేశంలో పలు ప్రభుత్వ సంస్థలు తనఖా పెట్టడం ద్వారా వచ్చిన పెట్టుబడులతో కొత్త పరిశ్రమలు స్థాపించడం లాంటి చర్యలు తీసుకుంటారు.

ఇప్పటికే దేశంలో అనేక ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరణ చేస్తున్నట్టు ప్రకటన చేయడం తెలిసిందే. కరోనా సంక్షోభం చుసిన తరువాత ఉద్యోగాలు ప్రభుత్వాన్ని అడగటం అంత తేలిక కాదు. ఉన్నవి ఊడిపోయినవాళ్లు, ఇప్పుడే విద్య ముగించుకుని ఉద్యోగాల కోసం సిద్ధంగా ఉన్నవాళ్లు అంటూ క్యూ లో చాలా మందే ఉన్నారు. వీరందరికి ఉద్యోగాలు అంటే ఏ ప్రభుత్వమైనా తల్లకిందులుగా తపస్సు చేసినా కూడా ఇవ్వడం సాధ్యం కానీ పని. అందుకే ఆస్తుల తనఖా, కొత్త సంస్థల ఏర్పాటుకు ప్రభుత్వం వ్ వడివడిగా అడుగులు వేస్తుంది.  ఏయే భారతీయ ఉత్పత్తులకు విదేశాలలో డిమాండ్ ఉందొ విశ్లేషణ చేసుకొని మరి ఆయా సంస్థల ఏర్పాటుకు  సంసిద్ధం అవుతుంది.

అందుకే తాజాగా కేంద్రప్రభుత్వం దేశంలో ఏడు మెగా ఇంటిగ్రేటెడ్ టెక్స్ టైల్ పార్కులను ఏర్పాటు చేస్తుంది.  అందుకే ఇప్పటికే కార్యాచరణ సిద్ధం చేసింది. కేబినెట్ ఆమోదం కూడా పొందింది. ఉపాధి సృష్టి పెట్టుబడుల ఆకర్షణ లక్ష్యంగా ఈ సంస్థలు ఏర్పాటు చేస్తున్నట్టు కేంద్ర మంత్రులు పీయూష్ గోయల్  తెలిపారు. ప్రధాని మోడీ 5ఎఫ్(ఫర్మ్ టు ఫైబర్ టు ఫ్యాక్టరీ టు ఫ్యాషన్ టు ఫారిన్) విజన్ స్పూర్తితో ముందుకుపోతున్నారు అని ఆయన చెప్పారు. ప్రపంచస్థాయి మౌలిక వసతుల ఏర్పాటుకు ఈ పధకం(పీఎం-మిత్ర) ఉపకరిస్తుందని ఆయన తెలిపారు. దీనివలన అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం, విదేశీ, స్థానిక పెట్టుబడులు వస్తాయని పేర్కొన్నారు. ప్రస్తుతం దేశంలో ఉన్న వస్త్ర పరిశ్రమ అంతర్జాతీయ స్థాయిలో పోటీ పడాలనే లక్ష్యంతో ఈ పార్కులు ఏర్పాటు చేస్తున్నారు. దీనిలో వస్త్ర తయారీకి కావాల్సిన స్పిన్నింగ్, వీవింగ్, డైయింగ్, ప్రింటింగ్ అన్ని ఒకే చోట జరుగుతాయి. ఒక్కో పార్కు వలన ప్రత్యక్షంగా లక్ష మందికి, పరోక్షంగా 2 లక్షల మందికి ఉపాధి లభించే అవకాశం ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: