ఇక మీరు మీ ఆధార్ కార్డ్(Aadhar Card) ఫోటోకాపీని (ఆధార్ కార్డ్ జిరాక్స్ కాపీ) ఇప్పటి ఎవరితోనైనా కానీ షేర్ చేసినట్లైతే..ఇక ఈ వార్త మీ కోసం మాత్రమే. ఆధార్ కార్డుకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఓ కీలక ప్రకటన జారీ చేసింది. ఈ ప్రకటనలో ఓ సలహా కూడా ఇచ్చింది. ఆధార్ కార్డ్ ఫోటోను ఎవరితో కూడా పంచుకోవద్దని ప్రభుత్వం దేశ పౌరులకు విజ్ఞప్తి చేసింది. దీని వల్ల మీ ఆధార్ కార్డు దుర్వినియోగం అయ్యే ఛాన్స్ ఉందని ప్రభుత్వం హెచ్చరించింది. మీ ఆధార్ కార్డ్ ఫోటోకాపీ అనేది దుర్వినియోగం కాకుండా నిరోధించడానికి మీరు అవసరమైన చోట ఆధార్ కార్డ్ మాస్క్ ఫోటోకాపీని మాత్రమే షేర్ చేయాలి. అయితే.. ఇక ఆధార్‌ కార్డు అవసరం గురించి చెప్పాల్సిన పని లేదు. అలాగే ఎక్కడపడితే అక్కడ దీని ఫొటోకాపీ (జిరాక్స్‌)ని ప్రూఫ్‌గా ఇచ్చేస్తున్నాం. వాటిని వారు ఎలా ఉపయోగిస్తారో కూడా అసలు ఆరా తీయడం లేదు. పని అయిపోయాక తిరిగి తీసుకుందామన్న అవగాహన చాలా మందిలో కూడా ఉండడం లేదు.విచక్షణారహితంగా ఏ వ్యక్తి లేదా సంస్థతో తమ ఆధార్ ఫోటోకాపీలను అసలు పంచుకోవద్దని దేశప్రజలకు విజ్ఞప్తి చేసింది. ఇక uidai నుంచి వినియోగదారు లైసెన్స్ తీసుకున్న సంస్థలు ఏ వ్యక్తి గుర్తింపును స్థాపించడానికి ఆధార్‌ను ఉపయోగించవచ్చని మే 27 వ తేదీన ఎలక్ట్రానిక్స్ ఇంకా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ నోటిఫికేషన్ ని జారీ చేసింది.



హోటల్స్‌ ఇంకా అలాగే సినిమాహాళ్ల వంటి ప్రదేశాల్లో ఆధార్‌ కార్డు జిరాక్స్‌ను సమర్పించాల్సిన అవసరం లేదని కూడా స్పష్టం చేసింది. యూఐడీఏఐ అనుమతి ఉన్న సంస్థలు మాత్రమే ఆధార్‌ కార్డ్ను ధ్రువీకరణ కోసం ఉపయోగించుకోవాలని ఆదేశించింది. ఈ మేరకు ఆదివారం నాడు ఓ ప్రకటన కూడా విడుదల చేసింది కేంద్ర ప్రభుత్వం.ఇక 12 అంకెల బదులు చివరి 4 అంకెలు మాత్రమే కనిపించి ఉండే ఆధార్‌ పత్రమే ఈ మాస్క్‌డ్‌ ఆధార్‌. దీనిపై మీ ఫొటో, క్యూఆర్‌ కోడ్‌ ఇంకా అలాగే మీ చిరునామా ఇతర వివరాలు యథావిధిగా ఉంటాయి. ఎవరికైనా ఓ గుర్తింపు పత్రంలా ఆధార్‌ ఇవ్వాలనుకుంటే ఖచ్చితంగా ఈ మాస్క్‌డ్‌ ఆధార్‌ ఉపయోగపడుతుంది. ఆధార్‌ నంబర్‌ పూర్తిగా అవసరం లేని చోట ఇంకా ఇ-కేవైసీకి దీన్ని వినియోగించొచ్చు. బదులుగా ఇది కేవలం చివరి 4 అంకెలను మాత్రమే చూపుతుంది. uidai వెబ్‌సైట్ నుండి ఆధార్ మాస్క్ కాపీని మీరు ఈజీగా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: