కేవలం 8 నిమిషాలు స్పీచ్ కే ఏకంగా 6 లక్షల కోట్లు గల్లంతు అయ్యాయంటే ఆయన ఎంత పవర్ ఫుల్ వ్యక్తి అనేది పూర్తిగా అర్థం చేసుకోవచ్చు. ఆయన నోటి వెంట వచ్చిన పదాలు ప్రపంచాన్నే చాలా ప్రభావితం చేస్తాయన్నది ఈజీగా అర్థం చేసుకోవచ్చు.అమెరికా ఫెడరల్ రిజర్వ్ చైర్మన్ జెరోమ్ పావెల్ చేసిన ప్రకటనే ఇన్ని లక్షల కోట్లు పోవడానికి కారణం.ద్రవ్యోల్బణాన్ని అదుపులో పెట్టేందుకు ఇన్వెస్టర్లు ఎంతో కొంత బాధను భరించాల్సిందేనని.. కఠిన విధానాన్ని ఇందుకోసం అనుసరించబోతున్నట్లు జెరోమ్ ప్రకటించారు. దీంతో అమెరికన్ స్టాక్స్ భారీగా కుప్పకూలాయి. పావెల్ 8 నిమిషాల స్పీచ్ కే మార్కెట్లు కుదేలయ్యాయి. జాక్సన్ హోల్ ఫెడ్ యాన్యువల్ పాలసీ ఫోరమ్ లో కన్సాస్ సిటీలో జెరోమ్ కీలక ప్రసంగం చేశారు. ఈ స్పీచ్ లో ఆయన ద్రవ్యోల్బణ కట్టడి కోసం కేంద్ర బ్యాంకు వడ్డీ రేట్లను మరింత కఠినతరం చేస్తుందని చెప్పారు. రాబోయే రోజుల్లో మరింత వడ్డీ రేట్లు పెరుగుతాయని స్పష్టం చేశారు. ఆయన స్పీచ్ అయిపోయిన వెంటనే వాల్ స్ట్రీట్ మార్కెట్లు కుప్పకూలాయి.


వాల్ స్ట్రీట్ మార్కెట్ లో కీలకమైన మూడు సూచీలు డౌజోన్స్ ఎస్ అండ్ పీ నాస్ డాక్ లు మూడు శాతం లేదా అంతకుమించి పడిపోయాయి. కేవలం 8 నిమిషాల ఈయన ప్రసంగానికే అమెరికాలోని బిలియనీర్స్ సంపద 78 బిలియన్ డాలర్లకు పైగా అంటే భారతీయ కరెన్సీలో రూ.623777 కోట్లు తగ్గిపోయింది.ప్రపంచంలోనే అత్యంత అపర కుబేరుడుగా పేరుగాంచిన టెస్లా చీఫ్ ఎలన్ మస్క్ సంపద 5.5 బిలియన్ డాలర్లు తగ్గిపోయింది. ఆగస్టు 27 2022 నాటికి మస్క్ సంపద 254 బిలియన్ డాలర్లకు దిగొచ్చింది.అలానే రెండో సంపన్నుడైన అమెజాన్ ఫౌండర్ జెఫ్ బెజోస్ సంపద బ్లూమ్ బర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ ప్రకారం 6.8 బిలియన్ డాలర్లు తగ్గిపోయింది. మొత్తంగా ఈ ఇద్దరు టాప్ బిలియనీర్స్ సంపదనే సుమారు 12 బిలియన్ డాలర్లు అంటే రూ.95965 కోట్లు కోల్పోవడం మార్కెట్ వర్గాలను షాక్ కు గురిచేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: