ఈ రోజు హోలీ పండుగ సందర్బంగా ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వం తాజాగా చక్కటి తీపికబురు అందించింది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు అదిరిపోయే హోలీ పండుగ గిఫ్ట్ ప్రభుత్వం ప్రకటించింది.అదేంటంటే కేంద్ర ప్రభుత్వం ఉద్యోగులకు స్పెషల్ ఫెస్టివల్ అడ్వాన్స్ స్కీమ్‌ను తీసుకువచ్చింది.ఇంకా ఈ స్పెషల్ ఫెస్టివల్ అడ్వాన్స్ స్కీమ్ కింద కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు మొత్తం రూ. 10 వేలు పొందొచ్చు. అంటే హోలీ పండుగకు ఉద్యోగులు రూ. 10 వేల డబ్బులు ముందుగానే పొందొచ్చు. అంతేగాక ఈ మొత్తంపై ఎలాంటి వడ్డీ ఉండదు. మార్చి 31 వ తేదీ వరకు దీన్ని ఎప్పుడైనా కూడా ఉపయోగించుకోవచ్చు.ఇక కేంద్ర ప్రభుత్వం గత సంవత్సరం కూడా ఇదే సమయంలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు స్పెషల్ అడ్వాన్స్ స్కీమ్‌ను తీసుకు రావడం జరిగింది. ఆర్థిక మంత్రిత్వ శాఖ ఈ బెనిఫిట్ ని కల్పిస్తూ వస్తోంది.ఇక కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల అకౌంట్‌పై ఈ డబ్బులు ముందుగానే రిజిస్టర్ అయ్యి ఉంటాయి.ఉద్యోగులు వీటిని తీసుకొని ఉపయోగించుకోవచ్చు. ఇలా ముందుగా పొందే అడ్వాన్స్ మొత్తంపై వడ్డీ భారం కూడా ఉండదు. తీసుకున్న రూ. 10 వేల మొత్తాన్ని నెలకు రూ. 1000 చొప్పున చెల్లిస్తే సరిపోతుంది.


ఇంకా ఈ ఫెస్టివల్ అడ్వాన్స్ స్కీమ్ కింద దాదాపు రూ. 4 వేల కోట్ల నుంచి రూ. 5 వేల కోట్ల దాకా కేంద్ర ప్రభుత్వం డబ్బుని కేటాయిస్తుంది. ఇంకా అంతేకాకుండా ఇలా అందించే స్పెషల్ అడ్వాన్స్ స్కీమ్ మొత్తంపై ఉండే బ్యాంక్ చార్జీలను కూడా కేంద్రమే భరించే అవకాశం కూడా ఉంది.అయితే ఉద్యోగులు మాత్రం ఇలా అడ్వాన్స్ మొత్తాన్ని పొందాలని భావిస్తే.. ఒక విషయం ఖచ్చితంగా గుర్తించుకోవాలి. ఇలా పొందిన రూ. 10 వేల మొత్తాన్ని కూడా ఉద్యోగులు డిజిటల్ రూపంలోనే వినియోగించాల్సి ఉంటుంది. అంటే డిజిటల్ లావాదేవీలను ఖచ్చితంగా ప్రోత్సహించాలని ప్రభుత్వం భావిస్తోంది.ఇక మోడీ ప్రభుత్వం గతంలో ఉద్యోగుల కోసం ఎల్‌టీసీ క్యాష్ వోచర్ స్కీమ్ కూడా తీసుకువచ్చిన సంగతి తెలిసిందే. దీన్ని ఉద్యోగులు ట్రావెల్ అలవెన్స్ కోసం పొందొచ్చు.ఇంకా అలాగే మరోవైపు కేంద్ర ప్రభుత్వం ఉద్యోగులకు డియర్‌నెస్ అలవెన్స్ (డీఏ) పెంపు రూపంలో గుడ్ న్యూస్ అందించే ఛాన్స్ ఉందని సమాచారం తెలుస్తోంది. ఈసారి డియర్‌నెస్ అలవెన్స్ మరో 4 శాతం మేర పెరిగే ఛాన్స్ ఉందని బిజినెస్ నిపుణులు అంచనా వేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: