ముఖేశ్ అంబానీ.. అపరకుబేరుడు, గొప్ప పారిశ్రామిక వేత్త, ఓ తరం కళ్ళ ముందే కోట్ల సామ్రాజ్యన్ని సృష్టించిన ఓ నిత్య కృషీవలుడు. తాను ఎదుగుతూ, కొన్ని లక్షల మందికి ఉపాధి కల్పించిన, కల్పిస్తున్న ఓస్వాప్నికుడు. ఇదంతా ఆయన కష్టం. ఆయన ఆలోచన నుండి పుట్టిన సంపద. అన్నిటికీ మించి వన్ ఆఫ్ ది హయ్యెస్ట్ ట్యాక్స్ పేయిర్. ఇన్ని సాధించినా అంబానీపై, ఆయన కుటుంబంపై, ఆయన ఎదుగుదలపై ఏడ్చే వారికి మన దేశంలో అస్సలు కొదవ లేదు. అంబానీనా ఓ పెట్టుబడిదారుడు. అదంతా ప్రజల సొమ్మే కదా? జియోని సక్సెస్ చేసుకొని వేల కోట్లు సంపాదించుకున్నాడు కదా అంటూ కాకమ్మ కబుర్లు చెప్తూ ఉంటారు. ఇలాంటి వారికి ఇండియన్ టెలికామ్ రంగంలో జియో ఓ రెవెల్యూషన్ అనే విషయం కూడా అర్ధం కాదు. అయితే.., ఇన్నాళ్లు ఇలాంటి వారి చేత కూడా మాటలు అనిపించుకుంటూ వచ్చిన ముఖేశ్ అంబానీ.. ఇప్పుడు తన కొడుకు పెళ్లి వేడుకలతో అందరికీ సరైన సమాధానం చెప్పాడు.అనంత్ అంబానీ- రాధికా మర్చంట్‌ను వివాహం జులై 12న జరగనుంది. అయితే.., ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ అంటూ మార్చి 1 నుంచి 3వ తేదీ వరకు గుజరాత్‌లోని జామ్‌నగర్‌లో వేడుకలు వైభంగా జరుగుతున్నాయి. ఈ ప్రీ వెడ్డింగ్ ఫంక్షన్‌ వేడుకల్లో అన్నీ రంగాల్లో టాప్ పర్సన్ గెస్ట్ లుగా హాజరయ్యారు. ఇంకా యాడ్ అవుతూనే ఉన్నారు. మూడు రోజులకి కలిపి 2500 రకాల వంటకాలు. అద్భుతమై సదుపాయాలు. ఒక్క గెస్ట్ కి కూడా ఏది తక్కువ కాకుండా ఏర్పాట్లు. ఈ మొత్తం ఖర్చు రూ .1000 కోట్లు అని టాక్. సరే.. అంబానీ రేంజ్ కి ఇదేమి అంత పెద్ద మొత్తం కాదు. మరి ఇంకెందుకు అంబానీ గ్రేట్? ఇక్కడే ఉంది అసలు విషయం. అసలు అంబానీ ఇంత ఖర్చు పెట్టి పెళ్లి చేస్తూ.. వరకు గుజరాత్‌లోని జామ్‌నగర్‌లో ఈ వేడుకలు ఎందుకు పెట్టుకోవాలి.

చిన్న చిన్న సినీ స్టార్స్ కూడా విదేశాల్లో వెడ్డింగ్ చేసుకుని ఫొటోలకి ఫోజులు ఇస్తున్న రోజుల్లో అంబానీలు ఓ చిన్న ఊరిలో ఈ వేడుక ఎందుకు చేయాలి? ఓ దేశ ప్రధాని ఇచ్చిన పిలుపుకి కట్టుబడి. ఇక్కడి సంపద వెడ్డింగ్స్ పేరుతో వేరే దేశంలో ఎందుకు ఖర్చు చేయడం అన్న మోదీ పిలుపుతో అంబానీలు తమ మట్టి వాసనలను వెతుక్కుంటూ.. తాము పెరిగిన మనుషుల మధ్య ఈ వేడుక చేసుకుంటున్నారు. వేల కోట్లు ఖర్చు చేసే ఈ పెళ్లి వేడుకలో సామాన్యులను భాగం చేశాడు అంబానీ. గుజరాత్ జామ్‌నగర్‌లోని రిలయన్స్ టౌన్‌షిప్ సమీపంలో ఉన్న జోగ్వాడ్ గ్రామంలో అన్న సేవ కార్యక్రమం చేశారు. ఏకంగా 51 వేల మంది స్థానికులకు విందు ఏర్పాటు చేశారు.అష్టఐశ్వర్యాలతో వర్ధిల్లుతూ.. నేల కాలు పెడితే కందిపోయే ఆ దంపతులు ఏకంగా కిందకి దిగి వచ్చారు. ఆ ఊరి ప్రజలకు స్వయంగా తమ చేతులతో భోజనాలు వడ్డించారు. జై శ్రీరామ్ అంటూ జపిస్తూ తమ ధర్మాన్ని గౌరవించుకున్నారు. ఇక్కడితో ఆగిపోలేదు. తమ సంస్థల్లో పని చేసే ప్రతి ఉద్యోగికి ఈ వేడుక సందర్భంగా అద్భుతమైన గిఫ్ట్స్ అందించారు. ఈ ఒక్క ఖర్చు వందల కోట్లు దాటింది. ఇప్పుడు సెలబ్రెటీలను పిలిచి.. వారికి అన్నీ సదుపాయాలు కల్పిస్తూ.. ఓ కొత్త ప్రపంచాన్ని పరిచయం చేస్తున్నారు. ప్రతి ఒక్కరి అవసరాన్ని దగ్గర ఉండి చూసుకుంటున్నారు. ఇంత చేస్తున్నా.. ఏర్పాట్లలో ఏవైనా తగ్గుంటే.. మా కుటుంబాలను క్షమించండి అంటూ ఆ పెళ్లి కొడుకు అతిథులను వేడుకుంటున్నాడు.వరల్డ్ రిచెస్ట్ ఫ్యామిలీ ఇన్ని కట్టుబాట్లని ఫాలో అవుతూ, ఇంత మానవత్వాన్ని చాటుకుంటూ, ఇన్ని మర్యాదలను పాటిస్తూ, అతిథి ధర్మాన్ని గౌరవిస్తూ.. ఇలాంటి వేడుక చేసుకుంటే తప్పేంటి? ఇది ఓ రకంగా మన సంస్కృతి, సంప్రదాయాన్ని గౌరవించుకోవడమే కదా? ఇక ఎవరి తాహతకి తగ్గట్టు వాడు పెళ్లి గొప్పగానే చేసుకుంటాడు. ఇప్పుడు మనం చూస్తుంది అంబానీ రేంజ్ అంతే. కాబట్టి.. చూడాల్సింది ఖర్చు పెడుతున్న రూ.1000 కోట్లు గురించి కాదు. ఆ ఇంటి మనుషుల సంస్కారాన్ని. హేట్సాఫ్ అంబానీ. ఇక చివరగా కొంతమంది ఉంటారు. ఇంత ఖర్చు పెట్టి పెళ్లి దేనికి? పేదవారికి దానాలు చేయొచ్చు కదా అని! అంబానీ ట్రస్ట్ ల తరుపున జరుగుతున్న సేవా కార్యక్రమాల ఖర్చు ప్రతి నెలా కోట్లలో ఉంటుంది. కాబట్టి.. ఆ చర్చ అనవసరం. మరి.. చూశారు కదా? కుబేరుడు అంత ఎదిగినా.. తమ రూట్స్ మరచిపోని అంబానీ కుటుంబంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

మరింత సమాచారం తెలుసుకోండి: