ప్రపంచ వ్యాప్తంగా బంగారం ధరలు రోజు రోజుకు పెరుగుతున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఇకపోతే బంగారం ధరలు సహజంగా ఏదైనా రెండు దేశాల మధ్య యుద్ధం జరిగినప్పుడు , స్టాక్ మార్కెట్ పెద్ద ఎత్తున కుదేలైనప్పుడు బంగారం ధరలు పెరుగుతూ ఉంటాయి. అందుకు ప్రధాన కారణం ఏదైనా రెండు దేశాల మధ్య యుద్ధం జరిగినప్పుడు ప్రపంచ వ్యాప్తంగా స్టాక్ మార్కెట్లు కుదరయ్యే అవకాశాలు ఉంటాయి. దానితో పెట్టుబడిదారులలో చాలా మంది స్టాక్ మార్కెట్లో కాకుండా తమ పెట్టుబడులను బంగారం పై పెట్టే అవకాశం ఉంటుంది. దానితో ఒక్క సారిగా బంగారం ధరలు పెరుగుతాయి. ఇక యుద్ధాలు ముగిసి సాధారణ వాతావరణం నెలకొన్న తర్వాత స్టాక్ మార్కెట్లో మంచి స్థితిలోకి వస్తాయి.

దానితో బంగారం పై పెట్టు బడులు పెట్టిన వారిలో చాలా శాతం మంది ఆ బంగారాన్ని అమ్మి వేసి స్టాక్ మార్కెట్లో పెట్టు బడులు పెట్టడం వల్ల బంగారం ధరలు తగ్గే అవకాశం ఉంటుంది. ఇకపోతే ఈ మధ్య కాలంలో చాలా వరకు యుద్ధాలు తగ్గు ముఖం పట్టాయి. కానీ బంగారం ధరలు మాత్రం పెరికి అలాగే ఉంటున్నాయి. దానికి ప్రధాన కారణం డాలర్ వేల్యూ పడిపోవడం అని కొంత మంది అభిప్రాయ పడుతున్నారు.  డాలర్ వ్యాల్యూ పడిపోవడం వల్ల ప్రపంచ వ్యాప్తంగా రిజర్వ్ బ్యాంక్ పెద్ద ఎత్తున బంగారాన్ని కొనుగోలు చేస్తూ దానిని సేఫ్ గా దాచుకుంటున్నట్లు తెలుస్తోంది. దానితో పెద్ద ఎత్తున రిజర్వ్ బ్యాంక్స్ బంగారాన్ని కొనుగోలు చేస్తూ ఉండడంతో బంగారం ధర తగ్గడం లేదు అని తెలుస్తుంది. ఇక బంగారం ధర ఇదే స్థాయిలో కొనసాగుతుంది అని కూడా చాలా మంది అభిప్రాయ పడుతున్నారు. ఇకపోతే గత కొన్ని రోజులుగా వరుస పెట్టి బంగారం ధరలు క్రమ క్రమంగా పెరుగుతూ వస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: