కావాల్సిన ప‌దార్థాలు: 
పచ్చికొబ్బరి తురుము- కప్పు
బఠాణీలు- రెండు కప్పులు
తాలింపు దినుసులు- రెండు చెంచాలు
ఉప్పు- రుచికి తగినంత

 

చింతపండు గుజ్జు- చెంచా
ఇంగువ- చిటికెడు
కరివేపాకు- నాలుగురెబ్బలు
జీలకర్ర- చెంచా

 

పచ్చిమిర్చి లేదా ఎండుమిర్చి- ఆరు
వెల్లుల్లి- ఐదారు రెబ్బలు
నూనె- రెండు చెంచాలు

 

తయారీ విధానం: ముందుగా నూనె వేయకుండా పాన్‌లో విడివిడిగా బఠాణీలు, ఎండుమిర్చి వేయించి పెట్టుకోవాలి. త‌ర్వాత ఎండుమిర్చి, కొబ్బరి, బఠాణీలను కలిపి అందులో ఉప్పు, చింతపండు, జీలకర్ర, వెల్లుల్లి వేసి మిక్సీలో తిప్పాలి. తరవాత మ‌రికొద్దిగా నీళ్లు పోసి మళ్లీ తిప్పాలి. 

 

మెత్తగా అయిన మిశ్రమం తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు పాన్‌లో నూనె పోసి వేడి చేయాలి. త‌ర్వాత‌ తాలింపు దినుసులు, కరివేపాకు, ఇంగువ వేయాలి. దినుసులు వేగాక పాన్‌లో ముందుగా పేస్ట్ చేసుకున్న‌ మిశ్రమం వేసి కలియతిప్పి స్టౌ ఆఫ్ చేస్తే స‌రిపోతుంది. అంతే ఎంతో సులువైన కొబ్బరి బఠాణీల చట్నీ రెడీ..!! 

మరింత సమాచారం తెలుసుకోండి: