కావాల్సిన ప‌దార్థాలు: 
మినప్పప్పు- రెండు కప్పులు
మిరప్పొడి- ఒక‌ టీ స్పూన్‌
పంచదార- ఒక‌ టేబుల్‌స్పూన్‌

 

ఉప్పు- రుచికి స‌రిప‌డా
నూనె- వేయించడానికి సరిపడా
పెరుగు- ఒక లీటరు

 

జీరాపొడి- ఒక‌ టీ స్పూన్‌
అల్లం తురుము- ఒక టీ స్పూన్‌
కొత్తిమీర- చిన్న కట్ట
పొదీనా త‌రుగు- అర క‌ప్పు

 

త‌యారీ విధానం:  మినప్పప్పును ముందురోజు రాత్రే స‌రిప‌డా నీటిలో నానబెట్టాలి. మరుసటి రోజు బాగా క‌డిగి గ్రైండర్‌లో వేసి మెత్తగా రుబ్బి, ఉప్పు కలిపి పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు స్ట‌వ్ ఆన్ చేసి పాన్ పెట్టుకుని.. నూనె పోయాలి. నూనె కాగాక ఈ పిండిని చిన్నచిన్న గారెల మాదిరిగా ఒత్తి నూనెలో వేసి వేయించి తీసి నీళ్లలో వేసి ఒక నిమిషం నాననిచ్చి తీసేయాలి. 

IHG

ఇప్పుడు ఒక పాత్రలో పెరుగు వేసి చిక్కగా చిలకరించి, అందులో ఉప్పు, పంచదార, జీరాపొడి, మిరప్పొడి వేసి కలిపుకోవాలి. ఇప్పుడు అందులో ముందుగా వేయించి ఉంచుకున్న గారెలను వేయాలి. ఇక చివ‌రిగా కొత్తిమీర తరుగు, పుదీనా త‌రుగు మ‌రియు అల్లం తురుములను పైన చల్లాలి. అంటే ఎంతో సులువైన, రుచిక‌ర‌మైన చ‌ల్ల చ‌ల్ల‌ని దహీ వడ రెడీ అయిన‌ట్లే.

IHG

దహీ వడ లేదా పెరుగు వడ అని కూడా అంటారు. ఇది చాలా రుచిగా కమ్మగా ఉంటుంది. ఎక్కువగా తెలుగువారు ముఖ్యంగా ఆంధ్రవారు చేసుకునే తెలుగు వంటలులో ప్రధానమైనది ద‌హీ వ‌డ‌. మ‌రి ఈ లాక్‌డౌన్ కాలంలో ఓ సారి మీరు కూడా పైన చెప్పిన విధంగా దహీ వడను ట్రై చేసి ఎంజాయ్ చేసేయండి. పిల్ల‌లు కూడా దీన్ని ఎంతో ఇష్టంగా తింటారు.
 

మరింత సమాచారం తెలుసుకోండి: