పునుగులు ఎంత రుచిగా వుంటాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. సాయంత్రం వేళ టిఫిన్ కి తింటానికి ఇవి చాలా బాగుంటాయి. ఇక పునుగులు ఆయిల్ ఫుడ్ అయినా కానీ బలానికి చాలా మంచిది. ఇక అరటిపండుతో కూడా పునుగులు తయారు చేసుకోవచ్చు. అరటి పండ్లు కూడా ఆరోగ్యానికి ఎంత మంచివో అందరికి తెలిసిందే. అరటి పండులో మంచి ఆరోగ్యకరమైన పోషకాలు ఉంటాయి. ఇది చాలా బలం ఇస్తుంది. రోజు వ్యాయామం చేసేవారు ఈ అరటిపండుని తీసుకోవడం వలన చాలా పుష్టిగా ఉంటారు. ఇక అరటిపండుతో రుచికరమైన ఇంకా ఆరోగ్యకరమైన పునుగులు ఎలా తయారు చెయ్యాలో తెలుసుకోండి. మీరు ఇంట్లో ట్రై చెయ్యండి...


అరటిపండు పునుగులు తయారు చెయ్యడానికి కావలసిన పదార్ధాలు....


అరటి పండ్లు - 4 (మెత్తగా గుజ్జులా చేసుకోవాలి)
గోధుమ పిండి - పావు కప్పు
బియ్యప్పిండి - పావు కప్పు
మైదా పిండి - పావు కప్పు
మొక్కజొన్న పిండి - ముప్పావు కప్పు
ఉప్పు - తగినంత
బేకింగ్‌ పౌడర్‌ - 1 టీ స్పూన్‌
పంచదార - 2 టేబుల్‌ స్పూన్లు
నూనె - డీప్‌ ఫ్రై కి సరిపడా


అరటిపండు పునుగులు తయారు చేసే విధానం....


ఇక అరటిపండు పునుగులు ఎలా తయారు చెయ్యాలంటే ముందుగా ఒక బౌల్‌ తీసుకుని.. అందులో అరటిపండ్ల గుజ్జు, గోధుమ పిండి, బియ్యప్పిండి, మొక్కజొన్న పిండి, బేకింగ్‌ పౌడర్, పంచదార, ఉప్పు ఒకదాని తర్వాత ఒకటి జోడించి, బాగా కలుపుకుంటూ ముద్దలా చేసుకోవాలి. ఆ మిశ్రమాన్ని బాగా కాగుతున్న నూనెలో పునుల్లా వేసుకుని దోరగా వేయించి సర్వ్‌ చేసుకోవాలి.ఇక రుచికరమైన అరటిపండు పునుగులు తయారైనట్లే. ఇవి ఎంతో రుచికరంగా ఉంటాయి. ముఖ్యంగా ఈ అరటిపండు పునుగులు సాయంత్రం పూట టిఫిన్ లా తినటానికి చాలా బాగుంటాయి..ఇంకెందుకు ఆలస్యం ఈ రుచికరమైన అరటి పండు పునుగులు మీరు ఇంట్లో ట్రై చెయ్యండి. హ్యాపీ గా తినండి..


మరింత సమాచారం తెలుసుకోండి: