
కావాల్సిన పదార్ధాలు:
2 cup పెసరపప్పు
6 tbsp పచ్చి శెనగపప్పు
30 కాబూలీ సేనగలు
1 cup ఉల్లిపాయ తరుగు
8 పచ్చిమిర్చి
2 టొమాటో
2 tsp పసుపు
5 cup నీళ్ళు
తాలింపు కోసం
కొత్తిమీర – చిన్న కట్ట
200 gm మునగాకు
4 tbsp నూనె
2 tsp ఆవాలు
2 tsp జీలకర్ర
6 ఎండు మిర్చి
10 దంచిన వెల్లులి
1 cup పచ్చి కొబ్బరి
2 tbsp కొబ్బరి నూనె
ఉప్పు
తయారీ విధానం :
పప్పులన్నీటిని ఒక గంట సేపు నానబెట్టుకుంటే మెత్తగా ఉడుకుతాయి. ఇప్పుడు ఆ పప్పులను ఒక కుక్కర్లో వేసి నీళ్ళు పోసి 4 కూతలు వచ్చే దాకా ఉడికించి దింపేసుకోండి. తరువాత ఒక బాండీ పెట్టి అందులో మునగాకు వేసి పసరు వాసన పోయే దాకా వేపుకోవాలి.ఆకు వేగాక ఇప్పుడు మెత్తగా ఉడికిన పప్పు, టొమోటో,పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు వేసి బాగా కలుపుకోండి. అవసరమైతే కొద్దిగా నీళ్ళు పోసుకుని ఉడికించాలి. తరువాత కొద్దిగా ఉప్పు, కారం, పసుపు వేయాలి.ఆఖరుగా పచ్చికొబ్బరి, కొబ్బరి నూనె వేసి బాగా కలిపి ఒక నిమిషం ఉడికించి దింపేసుకోండి.ఇప్పుడు పప్పుని చక్కగా మెత్తగా మెదుపుకుని పక్కన పెట్టుకోవాలి. స్టవ్ వెలిగించి కడాయి పెట్టి నూనె వేడి చేసి ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, వెల్లుల్లి రెబ్బలు, కరివేపాకు వేసి పోపు వేపుకోవాలి.చివరగా కొత్తిమీర కూడా వేసుకోండి. కూటులో వేసిన పెసరపప్పు కారణంగా చల్లారాక కూటు గట్టిగా చిక్కబడుతుంది. అలా చిక్కగా అనిపిస్తే ఎప్పుడైనా వేడి నీళ్ళతో పలుచన చేసుకోవచ్చు.అంతే ఎంతో సువాసన భరితమైన మునగాకు పప్పు రెడీ అయినట్లే.. !!