దేశ‌వ్యాప్తంగా మ‌హిళ‌ల‌పై రోజు రోజుకు కామాంధులు రెచ్చిపోతున్నారు. ప్ర‌భుత్వం కామాంధుల కోసం ఎన్ని చ‌ట్టాలు తీసుకొచ్చినా కానీ.. అవి వారికి చుట్టాలుగానే మారాయి. మహిళ‌ల ర‌క్ష‌ణ కోసం నిర్భ‌య‌, షీటీమ్ లాంటివి కేంద్ర‌, రాష్ట్ర ప్ర‌భుత్వాలు తీసుకొచ్చినా అవి అక్క‌ర‌కు రాకుండా పోతున్నాయి. కామాంధులు ఆ స‌మ‌యంలో కామంతో రెచ్చిపోయి వింత‌గా ప్ర‌వ‌ర్తిస్తుంటారు. తాజాగా ఆంధ్ర‌ప్ర‌దేశ్ ఓ దారుణ ఘ‌ట‌న చోటు చేసుకున్న‌ది. కామాంధుల క‌బంధ హ‌స్తాల్లో చిక్కుకున్న ఓ బీహార్ మ‌హిళ బ‌లియింది.

ఆమెను అత్యాచారం చేసి.. దారుణంగా హింసించారు. ప్ర‌తిఘ‌టించ‌డంతో చావ‌బాదారు. ఎముక‌లు కొర‌కే చ‌లిలో.. భ‌రించ‌లేని బాధ‌తో త‌న బిడ్డ ఏమైపోతాడో అనే ఆవేద‌న‌తో రాత్రి అంతా విల‌విల్లాడిన ఆ త‌ల్లి తెల్లారే స‌రికి మృత్యుఒడిలోకి చేరుకుంది.  ఈ పాడు ప్ర‌పంచంలో బ్ర‌త‌క‌లేక శాశ్వ‌తంగా నిద్రలోకి వెళ్లింది. ఎంత అమానుషం ఇది. నిర్భ‌య‌, దిశ ఘ‌ట‌న లాంటి ఘ‌ట‌నే అని చెప్పుకోవ‌చ్చు. చంటి పిల్లోడు ప‌క్క‌నే ఉన్నా.. ఆ మృగాళ్ల మ‌న‌సులో జాలి క‌ల‌గ‌లేదంటే వారిని మ‌నుషులు అనవ‌చ్చో.. ఆ ప‌సివాడి ఏడుపు వింటే రాళ్లు అయినా క‌రుగుతాయేమో కానీ.. ఆ క‌ఠినాత్ములు మాత్రం అవేమి ఆలోచించ‌లేదు. జంతువుల్లా మీద‌ప‌డి వాంఛ తీర్చుకున్నారు.  

క‌ర్నూలు జిల్లా డోన్ రైల్వే స్టేష‌న్‌లో ఈ దారుణ ఘ‌ట‌న చోటు చేసుకున్న‌ది. ఎన్ని బాధ‌లున్నాయో తెలియ‌దు. ఎక్క‌డ నుంచి వ‌చ్చిందో తెలియ‌దు. ఎక్క‌డికి వెళ్లాల‌నుకుందో స‌మాచారం లేదు. బీహార్‌కు చెందిన ఓ మ‌హిళ త‌న ఏడాదిన్న‌ర వ‌య‌స్సు ఉన్న బిడ్డ‌తో డోన్ రైల్వే స్టేష‌న్ లో దిగింది. ఎక్క‌డికి పోవాలో తెలియ‌క అక్క‌డే ఒంట‌రిగా ఉన్న‌ది. ఇది అదునుగా భావించి మృగాళ్లు ఆ మ‌హిళ‌ను ప‌క్క‌కు లాక్కెళ్లి పాశవికంగా అత్యాచారా\నికి పాల్ప‌డ్డారు. ప్ర‌తిఘ‌టించ‌డంతో తీవ్రంగా కొట్టారు. ఆ దెబ్బ‌ల‌కు తాళ‌లేక ఆమె ఉద‌యం మృతి చెందింది. సూర్యుడు ఉద‌యించే సిరిక ఎవ్వ‌రూ తెలియ‌ని డోన్ రైల్వే స్టేష‌న్  అనాథ శ‌వంలా మిగిలిపోయింది. ఆ మ‌మిళ బాలుడిని శిశు సంర‌క్ష‌ణ కేంద్ర‌ముకు త‌ర‌లించారు పోలీసులు.   నిందితుల‌ను గుర్తించేందుకు పోలీసులు రంగంలోకి దిగి వేటాడుతున్నారు. ప్ర‌త్య‌క్ష సాక్షుల స‌మాచారం మేర‌కు ఇద్ద‌రూ  ఆటో డ్రైవ‌ర్లను అదుపులోకి తీసుకొని విచార‌ణ చేప‌ట్టారు.


మరింత సమాచారం తెలుసుకోండి: