సాధారణంగా భార్యాభర్తల మధ్య అన్యోన్యత చూస్తే ఎవరికైనా ముచ్చటేస్తుంది. పెళ్లి చేసుకుంటే ఇంత అందమైన బంధం ఉంటుందా అని ప్రతి ఒక్కరూ అనుకుంటూ ఉంటారు. కానీ నేటి రోజుల్లో ఇలాంటివీ సినిమాల్లో మాత్రమే కనిపిస్తున్నాయి. నిజ జీవితంలో మాత్రం భార్యాభర్తల మధ్య అన్యోన్యత అనేది ఎక్కడా కనిపించడం లేదు. చిన్నచిన్న కారణాలకే భార్యాభర్తల మధ్య మనస్పర్థలు ఏర్పడుతూ ఉండటం. ఆ మనస్పర్ధలు చివరికి విడాకుల వరకు వెళ్తూ ఉండటం చూస్తూ ఉన్నాం.. ఇక మరికొన్ని బంధాలలో చిన్న కారణాలకే ఆత్మహత్యలు చేసుకుంటున్న ఘటనలు కూడా తెరమీదికి వస్తూ ఉన్నాయి.


 ఇక్కడ ఇలాంటి తరహా ఘటన జరిగింది.. నీ కోరిక నేను చనిపోవడమే కదా ఎంతో సంతోషంగా మీ కోరిక తీరుస్తాను అంటూ  శోకసంద్రం తో నిండిపోయిన హృదయంతో లేఖ రాసిన మహిళా చివరికి బలవన్మరణానికి పాల్పడింది. ఈ ఘటన హైదరాబాద్ నగరంలోని జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. స్థానికంగా సంచలనంగా మారిపోయింది. రహ్మత్ నగర్ డివిజన్ కార్మిక నగర్ లో ఉంటూ వడ్రంగి పని చేసే మీరా సాహెబ్ తన అక్క కుమార్తె అయిన సంధ్య ని వివాహం చేసుకున్నాడు. అయితే ఇటీవలే భర్త సంధ్యను తిట్టడంతో పాటు ఇక తన తల్లిని కొట్టాడు అన్న కారణంతో మనస్థాపం చెంది ఆత్మహత్యకు పాల్పడింది.ఈ క్రమంలోనే స్థానికుల సమాచారం మేరకు సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని అక్కడే ఒక లేఖను స్వాధీనం చేసుకోవడం గమనార్హం.  అందులో సదరు వివాహిత ఇలా రాసి పెట్టింది. బాబాయ్ నీకు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటాను. మీ ఇంటి గుమ్మం లో శాశ్వతంగా అడుగుపెట్టను.. నువ్వు ఎంతో సంతోషంగా ఉండు అంటూ రాసింది. అదేసమయంలో తన భర్తని ఉద్దేశిస్తూ.. మావయ్య నీకు ఎప్పటికీ రుణపడి ఉంటా.. నేను చేసిన తప్పల్లా తల్లి మాట విని నీతో ఏడు అడుగులు వేయడమే. అప్పటినుంచి నరకం అనుభవించాను. నేను చేసిన తప్పల్లా ఫోన్ చేయడమే నా మొదటి తప్పు.. మన్నించి అప్పుడే నేను మారాను.. ఇక ఇటీవలే అనుకోని పరిస్థితుల్లో అమ్మతో కలిసి ఆటోలో వచ్చినందుకు తల్లిని కొట్టావు.. నన్ను తిట్టావ్.. నీ కోరిక నేను చనిపోవడమే కదా సంతోషంగా చనిపోతున్నా.. అంటూ రాసి ఉంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు..

మరింత సమాచారం తెలుసుకోండి: