తన కోపమే తన శత్రువు అన్న విషయం తెలిసిందే. అందుకే పెద్దలు కూడా అంటారు.. కోపం తగ్గించాలని లేకుంటే ఎన్నో అనర్థాలు జరిగి పోతాయని.. కానీ మనవాళ్ళు  నేను పట్టిన కుందేలుకు మూడు కాల్లె అని వారిస్తారు..ఏదైనా కోపం వచ్చినప్పుడు కట్టలు తెంచుకునే కోపం తో అవతలి వ్యక్తి ప్రాణాలు తీయడానికి వెనుకాడరు. ఆ కోపంలో ఎవరూ ఎం చెస్తున్నారొ మరచి మరి నేరాలకు దిగుతున్నారు.. తాజాగా ఓ ఘటన వెలుగు లోకి వచ్చింది.. తనకు నచ్చిన ఫుడ్ లో క్రీమ్ ఎక్కువగా ఉందని కోపం తో గన్ ను తీసుకొని కాల్చి చంపిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.


36ఏళ్ల వ్యక్తి అట్లాంటాలో సబ్ వే రెస్టారెంట్ కు వెళ్లాడు. తనకు శాండ్ విచ్ కావాలని ఆర్డర్ చేశాడు. కాసేపటికి ఓ మహిళా సర్వర్.. శాండ్ విచ్ తెచ్చి అతడికి ఇచ్చింది. కానీ ఆ శాండ్ విచ్ లో మేయో (గుడ్డు సొన, నూనెలతో చేసే వెన్న వంటి క్రీమ్) చాలా ఎక్కువగా ఉందని ఆ కస్టమర్ ఫిర్యాదు చేశాడు. దీని గురించి సర్వర్ తో వాదనకు దిగాడు..మహిళా సర్వర్ సర్ది చెప్పేందుకు ప్రయత్నించినా అతను వినలేదు. ఇంతలో మరో మహిళా సర్వర్ అక్కడికి వచ్చి ఆమె కూడా సర్ది చెప్పేందుకు ప్రయత్నించింది. కానీ అప్పటికే తీవ్ర ఉన్మాదంలోకి వెళ్లిపోయిన కస్టమర్.. తన దగ్గరున్న గన్ బయటక తీసి ఇద్దరు మహిళా సిబ్బందిపై కాల్పులు జరిపాడు. దీంతో 26 ఏళ్ల మహిళా సర్వర్ స్పాట్ లోనే చనిపోగా.. మరో 24 ఏళ్ల మహిళా సర్వర్ తీవ్రంగా గాయపడింది.


చనిపోయిన మహిళా సర్వర్ ఐదేళ్ల కుమారుడు కూడా అక్కడే ఉన్నాడు. అతడి కళ్ల ముందే తల్లి చనిపోవడం అందరినీ విషాదంలో ముంచింది. రెస్టారెంట్ యజమాని సమాచారంతో పోలీసులు అక్కడికి చేరుకుని.. ఈ దుర్మార్గానికి పాల్పడ్డ కస్టమర్ ను అరెస్టు చేశారు.శాండ్ విచ్ లో మేయో ఎక్కువైందంటూ గొడవకు దిగి కాల్పులు జరపడం దారుణం అంటున్నారు. బాధితురాలి కుటుంబానికి న్యాయం జరిగేలా చూడాలని, ఆ ఉన్మాదిని కఠినంగా శిక్షించాలని కోరుతున్నారు.ఈ ఘటన పై పూర్తీ వివరాలు తెలియాల్సి ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: