ఇటీవల కాలం లో ఎక్క చూసిన కల్తీ అనేది కనిపిస్తుంది. మనం రోజూ తినే ఆహారం దగ్గర నుంచి వాడే వస్తువుల వరకు కూడా ప్రతి ఒక్కటి కూడా కల్తీ అయింది అన్న విషయం తెలిసిందే. నిజాయితీగా ఉండటం కంటే ఇలా ఏదో ఒక విధంగా కల్తీ లకు పాల్పడి ఇక జనాలను మోసం చేస్తూ డబ్బు సంపాదించడానికి ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారు కేటుగాళ్లు. వెరసి ఇలా కల్తీ కల్లు వల్ల ఎంతో మంది ప్రజలఆరోగ్యం ప్రమాదంలో పడిపోతుంది అన్న విషయం తెలిసిందే. ఇక కల్తీ వస్తువులు కారణంగా ఎంతోమంది ఎన్నో రకాల అనారోగ్య  సమస్యలను కూడా కొనితెచ్చుకుంటున్నారు.


 అయితే ఇప్పటి వరకు మాంసం కూడా కల్తీ అవుతుంది అన్న విషయం గురించి కొన్ని సార్లు వార్తల్లో హాట్ టాపిక్ గా మారిపోయింది. ఎంతో మందికి విక్రయించే మాంసం విషయంలో కూడా ఎంతో నీచంగా అక్రమాలకు పాల్పడుతున్నారు అనే విషయం ఇటీవల బయటపడింది. ఏకంగా అక్రమంగా నిలువ ఉంచిన 100 కిలోల మాంసాన్ని ఇటీవలే అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటన కాస్త స్థానికంగా అందరినీ అవాక్కయ్యేలా చేసింది. ఈ ఘటన ఏపీలోని ఎన్టీఆర్ జిల్లా విజయవాడ వెలుగులోకి వచ్చింది. విజయవాడలోని కృష్ణలంక తారకరామా నగర్ కు చెందిన హరి మాణిక్య  రాము అనే వ్యక్తి తన ఇంట్లో అక్రమంగా మాంసాన్ని నిల్వ ఉంచాడు .


 ఈ క్రమంలోనే సమాచారం అందుకున్న అధికారులు వెంటనే అక్కడికి చేరుకొని తనిఖీలు నిర్వహించారు. ఈ క్రమంలోనే ఏకంగా వంద కిలోల కుళ్ళిపోయిన మాంసాన్ని స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. కాగా అధికారి   రవిచంద్ర మాట్లాడుతూ హరి మాణిక్యా రాము చనిపోయిన మేకలు గొర్రెలను తక్కువ ధరకు కొనుగోలు చేసి జంతువుల పొట్టలో ఉన్న పేగులను తొలగించి వాటి స్థానంలో ఐస్ ముక్కలను ఉంచి   నగరానికి తరలించడం లాంటివి చేస్తూ అక్రమ వ్యాపారం చేస్తున్నాడని విషయం విచారణలో తేలింది అంటూ చెప్పుకొచ్చారూ అధికారులు. ఆర్డర్లను బట్టి నిలువ ఉంచిన  మాంసాన్ని రెస్టారెంట్లకు సరఫరా చేస్తూ ఉంటాడు అంటూ చెప్పుకొచ్చాడు. ఇక తారకరామా నగర్ లోని ఆయన ఇంట్లో నిల్వ ఉంచిన 100 కిలోలకు పైగా కుళ్ళిపోయిన  మేకలు గొర్రెలు మాంసం పూర్తిగా పురుగులు పట్టి ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: