సాధారణంగా అత్తా కోడళ్ల పండుగ అంటేనే మనస్పర్థలకు గొడవలకు కేరాఫ్ అడ్రస్ గా ఉంటుంది అని ఎక్కువగా సినిమాల్లో చూపిస్తూ ఉంటారు. ఇక ఇదే కోణంపై అటు ఎన్నో సీరియల్స్ వచ్చి సూపర్ హిట్ కూడా అయ్యాయి అన్న విషయం తెలిసిందే. అయితే సినిమాల ప్రభావమొ లేకపోతే ఏదైనా కారణం ఉందో తెలియదు కానీ నిజంగానే అత్తాకోడళ్ల మధ్య బంధం సినిమాలో చూపించినట్లు గానే ఉంటుంది. ప్రతి విషయంలో కూడా అత్తాకోడళ్ల మధ్య సామరస్యం ఉండదు అనే చెప్పాలి.


 తరచూ ఒకరిపై ఒకరు చాడీలు చెప్పుకోవడం ఒకరిని ఒకరు సూటిపోటి మాటలతో వేదించడం.. కొన్ని కొన్ని సార్లు వేగంగా ఒకరిపై ఒకరు చేయి చేసుకోవడం లాంటి ఘటనలు కూడా వెలుగులోకి వస్తూ ఉంటాయి. సాధారణంగా ఎక్కువ శాతం అత్తలు కోడళ్లను వేధించడమే జరుగుతూ ఉంటుంది అని చెబుతూ ఉంటారు. కానీ ఇక్కడ మాత్రం ఏకంగా అత్త మీద కక్ష పెంచుకుని దారుణంగా హత్య చేసింది కోడలు. ఈ ఘటనతో అందరూ ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. పెడన పరిధిలోని కృష్ణా పురానికి చెందిన వీరబాబు అనే వ్యక్తికి కొండాలమ్మ అనే మహిళతో 12 ఏళ్ల క్రితం పెళ్లి జరిగింది.


 అయితే వీరి పెళ్ళి జరిగిన నాటి నుంచి కూడా అత్త రజిని కుమారి కోడలు కొండాలమ్మ మధ్య అస్సలు పొంతన కుదరలేదు. ప్రతి విషయంలో కూడా వీరి మధ్య గొడవలు జరుగుతూనే ఉండేవి. ఇటీవలే  అత్తపై కక్ష పెంచుకుంది కోడలు. ఇటీవల ఇంట్లో ఎవరూ లేని సమయంలో తల మీద విచక్షణారహితంగా కొట్టింది. తర్వాత గొంతు నులిమి చంపడానికి ప్రయత్నించింది. చివరికి చీరతో ఉరి బిగించింది. దీంతో అత్త చనిపోయింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పోస్టుమార్టం రిపోర్టులో రజిని కుమారి తలపై బలమైన గాయం అయినట్లు తేలింది. కాగా తమదైన శైలిలో  విచారిస్తే కోడలు కొండాలమ్మ నిందితురాలు అన్న విషయం బయటపడింది.

మరింత సమాచారం తెలుసుకోండి: