ఇటీవల కాలంలో సభ్య సమాజంలో నేరాలు ఎంతలా పెరిగిపోతున్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అటు మనుషులు ఉద్యోగము వ్యాపారమో చేసుకుంటూ గౌరవంగా జీవించడానికి బదులు.. ఇక నేరాలకు పాల్పడి  విలాసవంతమైన జీవితాన్ని గడపాలని ఆశపడుతున్నారు. వెనక ముందు ఆలోచించకుండా కొన్ని కొన్ని సార్లు మనుషుల ప్రాణాలను కూడా దారుణంగా తీసేస్తున్న ఘటనలు వెలుగులోకి వస్తున్నాయ్. ఇక మరికొన్ని చోట్ల చిన్నచిన్న కారణాలకి సాటి మనుషుల ప్రాణాలను దారుణంగా గాల్లో కలిపేస్తున్నారు మనుషులు.


 ఈ క్రమంలోనే నేరాలను అరికట్టేందుకు ఇటీవల కాలంలో అటు పోలీసులు కూడా ఎక్కడికక్కడ నిఘా ఏర్పాటు చేస్తున్నారు.  ముఖ్యంగా నేరస్తులను పట్టుకునేందుకు ఇటీవల కాలంలో ఇక ప్రతి చోటా ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలు ఎంతగానో ఉపయోగపడుతున్నాయి అని చెప్పాలి. ఇక సిసి కెమెరా ఫుటేజీ ఆధారంగానే పోలీసులు నేరస్తులను పట్టుకోవడం.. కోర్టులు నేరాలను ధ్రువీకరించి శిక్షలు వేయడం లాంటివి కూడా చేస్తున్నాయి అని చెప్పాలి. కానీ ఇక్కడ మాత్రం ఒక ఆసక్తికర ఘటన జరిగింది. ఏకంగా రామచిలక చెప్పిన సాక్ష్యంతో ఏకంగా కోర్టు నిందితులకు జీవిత ఖైదు విధిస్తూ నిర్ణయం తీసుకుంది అని చెప్పాలి.


 ఇది కాస్త ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారిపోయింది. ఇంట్లో ఒంటరిగా ఉంటున్న మహిళతో పాటు కుక్కను దారుణంగా చంపిన నిందితులను  అక్కడే ఉన్న రామచిలక పట్టించింది. 9 ఏళ్ల క్రితం జరిగిన మర్డర్ కేసులో ఇద్దరు నిందితులకు జీవిత ఖైదు విధిస్తూ ఇటీవల కోర్టు తీర్పు ఇవ్వడం ఆగ్రాలో జరిగింది. నీలం శర్మ అనే వివాహితను హత్య చేసినప్పుడు కళ్ళారా చూసింది రామచిలుక. రామచిలుక నిందితుల పేర్లు చెప్పడంతో ఇక ఆ దిశగానే పోలీసులు విచారణ చేపట్టారు. అయితే ఇలా సాక్ష్యం చెప్పిన ఆరు నెలలకు రామచిలక చనిపోయింది. అయినప్పటికి ఇక ఇప్పుడు రామచిలక చెప్పిన సాక్ష్యం ఆధారంగా నిందితులకు కోర్టు శిక్ష వేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: