ప్రస్తుతం ప్రతి మనిషి టెక్నాలజీ వెంట పరుగులు పెడుతున్నాడు. ఈ క్రమంలోనే ఒక్క నిమిషం కూడా తీరిక లేకుండా బిజీ బిజీ లైఫ్ నీ గడుపుతూ ఉన్నాడు అని చెప్పాలి. అయితే ఇక నేటి రోజుల్లో పెరిగిపోయిన టెక్నాలజీ అటు మనిషి జీవనశైలిలో కూడా ఎన్నో రకాల మార్పులు తీసుకువచ్చింది. ఇక ఇలాంటి టెక్నాలజీతోనే ప్రతి పనిని ఎంత సులభతరం చేసుకుంటున్నాడు మనిషి. ఇక తన జీవనశైలిలో ఎన్నో మార్పులు చేసుకుంటున్నాడు. ఇలాంటి సమయంలో ఇంకా మంత్రాలకు చింతకాయలు రాలుతాయి అనే నమ్మే జనాలు కూడా అక్కడక్కడ కనిపిస్తున్నారు.


 నేటి ఆధునిక యుగంలో అందరూ మూఢనమ్మకాలను వదిలేసి టెక్నాలజీని నమ్ముకుంటుంటే.. కొంతమంది మాత్రం ఇంకా మూఢనమ్మకాల మాయలోనే మునిగి తేలుతున్నారు. ఈ క్రమంలోనే మంత్రాల పేరుతో ఎన్నోదారుణాలకు పాల్పడుతున్న ఘటనలు ఎన్నో వెలుగులోకి వస్తున్నాయి అన్న విషయం తెలిసిందే. ఏకంగా ఇప్పటి రోజుల్లో కూడా నరబలులు లాంటి ఘటనలు జరుగుతున్నాయి. ఇలాంటి ఘటనలు ప్రతి ఒక్కరిని ఉలిక్కిపడేలా చేస్తున్నాయి. మరికొన్ని చోట్ల మంత్రాలు చేస్తున్నారు అనే కారణంతో కొంతమందిని ఏకంగా ఊరు జనాలు మొత్తం కొట్టి చంపేయడం లాంటి గతంలో కూడా వెలుగులోకి వస్తూ ఉన్నాయి.


 ఇక ఇప్పుడు మనం మాట్లాడుకోబోయేది కూడా ఇలాంటి తరహా ఘటన గురించే. రంగారెడ్డి జిల్లాలో అమానవీయ ఘటన జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం చౌదరి గూడా మండలం రావిర్యాల వాసి పద్మమ్మ చేతబడి చేస్తుంది అనే నెపంతో కొందరు ఆమెను చెట్టుకు కట్టేసి దారుణంగా కొట్టారు. అయితే పద్మమ్మ స్మశాన వాటిక నుంచి మృతదేహాలు బూడిద తీసుకువచ్చి గ్రామంలోని ఇళ్లపై చల్లుతూ ఉండడాన్ని గ్రామస్తులు గమనించారు. ఈ క్రమంలోనే ఆమె మంత్రాలు చేస్తుంది అని భావించి చెట్టుకు కట్టేసి దాడి చేశారు. ఈ క్రమంలోనే సదరు మహిళపై దాడి చేసిన తొమ్మిది మందిపై కేసు నమోదు అయింది. అయితే ఇలా మూఢనమ్మకాలకు దూరంగా ఉండాలని ఈ పోలీసులు తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: