
పోలీసుల విచారణలో అమ్ముబీ వాట్సాప్ చాట్‌లు పరిశీలించగా, లోకేశ్వరన్‌తో ఆమె సంబంధం, హత్య పథకం వెలుగులోకి వచ్చాయి. లోకేశ్వరన్ స్థానికంగా సెలూన్ నడుపుతూ ఆమెతో సన్నిహితంగా ఉండేవాడు. ఈ ఇద్దరూ కలిసి భర్తను హతమార్చేందుకు గుట్టుచప్పుడు పథకం రచించారు. సాంబారులో విషం కలిపి, సహజమైన మరణంగా చిత్రీకరించే ప్రయత్నం చేశారు. అయితే, ఆసుపత్రి నివేదికలు, వాట్సాప్ సందేశాలు ఆధారంగా పోలీసులు నిందితులను అరెస్టు చేశారు.
ఈ ఘటన సామాజిక మాధ్యమాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది.ఈ హత్య కేసు వివాహేతర సంబంధాలు, ఆర్థిక ఒత్తిళ్లు, నైతిక విలువల క్షీణత వంటి సామాజిక సమస్యలను బయటపెడుతోంది. అమ్ముబీకి ఇద్దరు సంతానం ఉన్నప్పటికీ, కుటుంబ బాధ్యతలను విస్మరించి, క్షణిక సుఖాల కోసం ఈ దారుణానికి పాల్పడడం ఆందోళన కలిగిస్తోంది. భర్త డ్రైవర్‌గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తుండగా, ఆమె ఈ నేరానికి ఒడిగటడం కుటుంబ విలువలపై ప్రశ్నలను లేవనెత్తుతోంది. సమాజంలో వివాహేతర సంబంధాలు చిచ్చురేపుతున్న సమస్యలను ఈ ఘటన స్పష్టం చేస్తోంది.
వాట్సాప్ నెంబర్ 94905 20108 కు మీ జిల్లాలో రాజకీయ, సామాజిక సమస్యలు వివరాలు పంపండి..
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 94905 20108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు