పవన్ కల్యాణ్ సోషల్‌ మీడియా నుంచి వాలంటీర్ల వ్యవస్థకు అసలు బాస్ ఎవరు? అక్కడి నుంచి డేటా ఎక్కడికి వెళుతుంది. కలెక్టర్ కా..  రెవెన్యూ డిపార్టుమెంట్ కా.... ఏ అధికారుల వద్దకు వెళుతుంది. ఇలా అనేక డౌట్లను పవన్ కల్యాణ్ మళ్లీ ప్రశ్నించారు. పవన్ కల్యాణ్ మరో సారి జగన్ చేసిన కామెంట్లకు వెంటనే సోషల్‌ మీడియా ద్వారా ఇలా మళ్లీ డౌట్లను అడిగారు.


ఏ ప్రభుత్వం అయినా డేటా స్టోరేజీ ఔట్ సోర్సింగ్ విధానంలో ప్రైవేటు కంపెనీల వద్ద ఉంటుందన్న విషయం అందరికీ తెలిసిందే. ఏ ప్రభుత్వానికి కూడా సొంత సోర్స్ లేదు. ఇలాంటి విధానం గురించి ఇప్పటికే చాలా మందికే తెలుసు. కాకపోతే పబ్లిక్ లోకి దీనిపై అనుమానం రేకెత్తించాడు.  వాలంటీర్ల వ్యవస్థ దుర్వినియోగం అయితే ఎవరిదీ బాధ్యత అని పవన్ ప్రశ్నించారు. అయితే దీనిపై బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ.. ఒక వేళ వాలంటీర్ల వ్యవస్థ దుర్వినియోగం అయితే దానికి పూర్తి బాధ్యత ప్రభుత్వానిదే అన్నారు. కానీ పవన్ కావాలనే ప్రభుత్వం పై బురద చల్లాలని ప్రయత్నాలు చేస్తున్నారు.


ముఖ్యంగా పవన్ చేస్తున్న పని వల్ల వాలంటీర్లు సైతం బాధపడుతున్నారనే అభిప్రాయం వ్యక్తం అవుతుంది. ఒకరో ఇద్దరు తప్పు చేస్తే దాన్ని వ్యవస్థ మొత్తానికి ఆపాదించడం అనేది చాలా దారుణమైన విషయం అని అంటున్నారు. బేసిక్ గా వాలంటీర్ల వల్ల మానవ అక్రమ రవాణ అని మొదట గగ్గోలు పెట్టినా ప్రస్తుతం డేటాను మాత్రమే దొంగిలిస్తున్నారని అంటున్నారు.


అయితే పవన్ ఉద్దేశం డేటా మాత్రం వాలంటీర్లకు ఇవ్వొద్దని ప్రజలకు పవన్ సూచిస్తున్నారు. మరి ప్రజలు డేటా ఇవ్వకుండా ప్రభుత్వం అందించే పథకాలు కోల్పోతే దానికి ఎవరూ బాధ్యలవుతారని పవన్ పై ఆయా పార్టీల నాయకులు విమర్శలు చేస్తున్నారు. మరి పవన్ మాటలు ప్రజలు వింటారా? డేటా ఇవ్వకపోతే ఏం జరుగుతుంది. రాబోయే కాలంలో తేలనుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: