చంద్రబాబు నాయుడు స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణంలో అరెస్ట్ అయిన తర్వాత ఈ అరెస్ట్ అనేది  జగన్ మోహన్ రెడ్డి చేయించాడని అన్నారు చాలా మంది. జగన్ ఒక సైకో అని, ఈ కేసు విషయంలో జగన్ వెనుక కేంద్రం సపోర్ట్  ఉందని కూడా అన్నారు. అసలు మోడీ ఈ కథంతా వెనకుండి నడిపించారని, పైకి కనిపించేది జగన్ ప్రతీకారం ఒకటేనని అంటున్నారు. ప్రతి వారిని తనకు అవసరం ఉన్నంత వరకూ వాడుకుని, తర్వాత వదిలేసే వాళ్లకి ఇదేవిధంగా జరుగుతుందని కూడా కొంతమంది అంటున్నారు.


కాలం, పరిస్థితి ఎప్పుడూ తన చేతిలోనే ఉండవని, అవతల వాళ్ళ చేతిలోకి వెళ్ళి  ఒక్కోసారి ఆయుధం లా మారతాయని అంటున్నారు. చంద్ర బాబు అనే వ్యక్తి చాలా మందికి వెన్నుపోటు పొడిచారని, అలాంటప్పుడు ఆయన కష్టాల్లో ఉన్నప్పుడు ఎవరికైనా సహాయం చేయడానికి పరామర్శించడానికి మనసు ఎలా వస్తుందని అంటున్నారు. 2014 ఎలక్షన్లకు ముందు  తాను అధికారంలోకి రావడానికి భారతీయ జనతా పార్టీని వాడుకున్నారు.


ఆ తర్వాత భారతీయ జనతా పార్టీ ఊసే ఎత్తలేదు. పైగా అదే పార్టీని విమర్శించారు కూడా. ఇప్పుడు మళ్లీ ఎలక్షన్లు దగ్గర పడుతున్న టైంలో తిరిగి భారతీయ జనతా పార్టీ  వైపు చూస్తున్నారని అంటున్నారు. 2014 టైంలో భారతీయ జనతా పార్టీ తోడు లేకపోతే నెగ్గే ప్రసక్తే లేదు తెలుగుదేశం పార్టీకి. ఆల్రెడీ అప్పటికే  రెండుసార్లు ఓటమిని చవి చూసి ఉంది వరుసగా. అప్పుడు భారతీయ జనతా పార్టీ అండతో, అంతకు ముందు వాజపేయి అండతో గెలిచారు.


కానీ మా ముందు వాళ్లెంత అన్నట్లుగా మాట్లాడతారు పని అయిపోయాక. అసలు ఇప్పుడు తెలుగుదేశం పార్టీ పరిస్థితి చూస్తే తెలంగాణలో అవకాశం లేదు. ఇక ఆంధ్రలో అయితే ఒక పక్కకి వెళ్లిపోయిన పరిస్థితి. అయినా కూడా  అవకాశ వాదమే ఆయన పద్ధతి అని, వెన్నుపోటు రాజకీయాలే ఆయనకు వెన్నతో పెట్టిన విద్య అని అంటున్నారు కొంత మంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

tdp