ఇటీవల ఇరాన్, ఇజ్రాయెల్ పై క్షిపణులు, డ్రోన్లతో దాడి చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో దీనికి ప్రతి స్పందనగా ఇజ్రాయెల్ కూడా ఇరాన్ పైకి దాడి చేయాలని నిర్ణయించగా.. మిడిల్ ఈస్ట్ లో ప్రస్తుతం ఉద్రిక్త వాతావరణం నెలకొంది. దీంతో దీని ఎఫెక్ట్ ముడి చమురుపై పడింది.  దాడి కారణంగా ముడి చమురు ధరలు మరింత పైకి పెరిగే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు పేర్కొంటున్నాయి.


చాలా దేశాలు మధ్య ప్రాచ్యం నుంచి చమురును ఎక్కువగా దిగుమతి చేసుకుంటున్నాయి. పెరుగుతున్నచమురు ధరలు ఆసియా ఫసిఫిక్ ఆర్థిక వ్యవస్థలకు గణనీయమైన ముప్పును కలిగిస్తాయి.  ముఖ్యంగా భారత్ తన అవసరాల్లో 85శాతం దిగుమతి చేసుకుంటుండగా.. ప్రస్తుత పరిస్థితులు ప్రభుత్వ రంగ చమురు మార్కెటింగ్  కంపెనీలకు సవాల్ గా మారాయి.


ఈ ఉద్రిక్తల వల్ల ముడి చమురు ధరలు పెరగడమే కాకుండా.. సరకు రవాణా కూడా ప్రభావితమవుతుంది. ఇప్పటికే హౌతీ దాడుల కారణంగా ప్రముఖ సరకు రవాణా కంపెనీల సురక్షితమైన రవాణా మార్గాలను అనుసరిస్తున్న భారతీయ సంస్థలకు షిప్పింగ్ ఖర్చులు పెరిగాయి. ఈ ఉద్రిక్తల నేపథ్యంలో ఒక్క ముడి చమురు ధరలు పెరగడమే కాకుండా.. సరకు రవాణా కూడా ప్రభావితమవుతుంది. ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో ప్రపంచ అన్ని దేశాల్లో ముడి చమురు ధరలు పెరుగుతున్నాయి.


కానీ నరేంద్ర మోదీ ముందు చూపు వల్ల మన దేశంలో చమురు ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. ఈ ఎన్నికల సమయంలో ఒకవేళ పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగితే ఇవి ఎన్నికలపై పెను ప్రభావం చూపేవే.  కానీ మోదీ జాగ్రత్తగా ముందస్తు అంచనా వేశారు. మనకు ఇరాన్ ద్వారా చౌహ్వారా పోర్టు నుంచి చమురు దిగుమతి అవుతుంది. కానీ ఉద్రిక్తల నేపథ్యంలో రూట్ ను మార్చారు. వయా ముంబయి, సౌదీ అరేబియా, దుబాయ్, ఇజ్రాయెల్, యూరప్ ల ద్వారా ముడి చమురును దిగుమతి చేసేలా మోదీ ముందస్తు ప్రణాళికలు రచించారు. ఇరాన్ దీనిని ఆపాలని చూసినా.. మోదీ ముందు వీరి పాచికలు పారలేదు.

మరింత సమాచారం తెలుసుకోండి:

war