పారుల్ కక్కర్..ఈమె ఓ గుజరాతీ కవియిత్రి. గృహిణి అయిన పారుల్ కొన్నేళ్లుగా కవిత్వం రాస్తున్నారు. కొడుకు ఫేస్‌బుక్ ను పరిచయం చేయడంతో పారుల్ కవితలకు ప్రాచుర్యం లభించింది. ఆమెకు ఫాలోయింగ్ పెరిగింది. అభిమానులూ పెరిగారు. ఆధ్యాత్మిక గేయాలు, శ్రీ కృష్ణుని మీద భక్తి గీతాలతో గుజరాత్ లో మంచి పేరు తెచ్చుకున్నారు. తాజాగా ఆమెపై నరేంద్ర మోడీ అభిమానుల దాడి మొదలైంది. ఫేస్‌బుక్‌లో ఆమె రాసిన ఓ కవితే ఇందుకు కారణం. ఆ కవిత ఏంటంటే..

శవ వాహిని గంగా
తెలుగు అనువాదం : రాఘ‌వ‌శ‌ర్మ

భ‌య‌ప‌డ‌కు... ఆనంద‌ప‌డిపో...
ఒకే గొంతుతో శ‌వాలు మాట్లాడుతాయి
ఓ రాజా...
నీ రామ రాజ్యంలో
శ‌వాలు గంగాన‌దిలో
ప్రవ‌హించ‌డం చూశాం
ఓ రాజా...
అడ‌వి అంతా బూడిద‌య్యింది,
ఆన‌వాళ్ళు లేవు
అంతా శ్మశాన‌మైపోయింది
ఓ రాజా...
బ‌తికించే వాళ్ళు లేరు
శ‌వాల‌ను మోసేవాళ్ళూ
క‌నిపించ‌డం లేదు
ధుఃఖితులు మాత్రం మిగిలారు
అంతా కోల్పోయి మిగిలాం
మాట‌లు లేక‌ బ‌రువెక్కిన
మా హృద‌యాలు శోక‌గీతాలైనాయి
ప్రతి ఇంటిలో మృత్యుదేవ‌త
ఎగిసిప‌డుతూ తాండ‌వ‌మాడుతోంది
ఓ రాజా...
నీ రామ రాజ్యంలో
శ‌వ‌ గంగా ప్రవాహ‌మైంది
ఓ రాజా...
క‌రిగిపోతున్న పొగ‌గొట్టాలు
క‌దిలిపోతున్నాయి
వైర‌స్ మ‌మ్మల్ని క‌బ‌ళించేస్తోంది
ఓ రాజా...
మా గాజులు ప‌గిలిపోయాయి
భార‌మైన మా హృద‌యాలు
ముక్కల‌య్యాయి
అత‌ను ఫిడేలు వాయిస్తున్నప్పుడు
మా న‌గ‌రం కాలిపోతోంది
బిల్లా రంగాల బ‌రిసెలు
ర‌క్తద‌ప్పిక గొన్నాయి
ఓ రాజా...
నీ రామ రాజ్యంలో
శ‌వ‌ గంగా ప్రవాహ‌మైంది
ఓ రాజా...
నీవు మెరిసిపోతున్నట్టు
మండుతున్న కొలిమి లాగా
నీ దుస్తులు త‌ళుక్కుమ‌న‌డం లేదు
ఓ రాజా...
ఈ న‌గ‌రమంతా చివ‌రిగా
నీ ముఖాన్ని చూస్తున్నాయి
ఇక‌ ప‌రిమితులు, మిన‌హాయింపులు లేవు
నీ ద‌మ్ము చూపించు
రా... బయిటికి రా...
గ‌ట్టిగా చెప్పు, పెద్దగా అరువు
దిగంబ‌ర రాజు
అవిటివాడు, బ‌ల‌హీనుడు
ఇక నీవు ఏ మాత్రం
మంచివాడిగా ఉండ‌లేన‌ని చెప్పు
కోపంతో ఊగిపోతున్న
న‌గ‌రం మంట‌లు ఎగిసిప‌డుతూ
ఆకాశాన్ని తాకుతున్నాయి
ఓ రాజా...
నీ  రామ‌రాజ్యంలో
శ‌వ‌గంగా ప్రవాహాన్ని చూశావా?

ఈ కవితపై మోడీ అభిమానులు ఏకంగా 28000 కామెంట్లు నెగిటివ్‌ గా పెట్టారు. " శబ్ వాహిని గంగా " పేరుతో రాసిన ఈ కవితలో " బట్టలు లేని  రాజు " అని రాయడం భక్తులకు కోపం తెప్పించింది. ఆమెను దేశద్రోహి అనీ దాడులు చేస్తామని భయపెడ్తున్నారు. ఈ కవిత ఆరు భాషల్లోకి అనువాదమై లక్షల షేర్ ల తో వైరల్ అవ్వడం వాళ్ళకు మింగుడుపడడం లేదు.



మరింత సమాచారం తెలుసుకోండి: