ఆ డిమాండ్‌కు తగ్గట్టుగానే భారీ సినిమాల టికెట్లకు రేట్లు పెంచుకునే వెసులుబాటు గతంలో ఉండేది. ఇప్పుడు కాస్త తగ్గిందనుకోండి. గతంలో సినిమా హాళ్ల దగ్గరే ఈ డిమాండ్‌కు తగ్గట్టు బ్లాక్ టికెట్ల వ్యవహారం సాగేది.. డబ్బు ఎక్కువైనా పర్లేదనుకునేవాళ్లు బ్లాక్‌లో కొనుక్కుని మరీ చూసేవాళ్లు.. అయితే ఇప్పడు ఆన్ లైన్ టికెటింగ్ వచ్చాక.. ఈ కష్టాలు కాస్త తగ్గాయి. అయితే.. ఇప్పుడు రాధేశ్యామ్ రిలీజ్ నేపథ్యంలో ప్రతిషోకూ ప్రతి థియేటర్ 100 టికెట్లు తమకు సమర్పించుకోవాలని ఏకంగా విజయవాడ మేయర్ సినిమా హాళ్లకు లేఖలు రాసినట్టు ఓ లేఖ వైరల్ అవుతోంది.
కొత్త సినిమాలు విడుదలైనప్పుడు పార్టీ వర్కర్లు, నాయకులు సినిమా టికెట్ల కోసం అడుగుతున్నారని.. అందువల్ల.. కొత్త సినిమాల విషయంలో విజయవాడ పరిధిలోని ప్రతి థియేటర్ షోకు 100 టికెట్లు మేయర్ ఛాంబర్ లో ఇవ్వాలని.. వీటికి డబ్బు చెల్లిస్తామని మేయర్ థియేటర్ల యజమానులకు రాసినట్టు ఆ లేఖలో ఉంది. సినిమా ధియేటర్ల యజమానులకు బెజవాడ మేయర్ పేరిట రాసినట్టు చెబుతున్న ఈ లేఖ ఇప్పుడు కలకలం రేపుతోంది.
కొత్త సినిమా విడుదల సందర్భంగా ప్రతి షో కి వంద టికెట్లు ఇవ్వాలని మేయర్ రాయన భాగ్యలక్ష్మి కోరినట్టు లేఖ సోషల్ మీడియాలో తిరుగుతోంది. నగరంలోని మల్టీఫ్లెక్సీలకు మేయర్ ఈ లేఖ రాశారట. ఏకంగా లెటర్ హెడ్ పై నేరుగా మేయర్ సంతకం ఉన్నట్టు తెలుస్తోంది. వంద టిక్కెట్లు కు డబ్బు చెల్లిస్తామని లేఖలో రాశారు. వైకాపా కార్పొరేటర్లు, కార్యకర్తలు సినిమా టికెట్లు అడుగుతున్నారని ఏకంగా మేయర్ లేఖ రాయడంతో మల్టీప్లెక్స్ థియేటర్ల యజమానులు ఆలోచనలో పడ్డారట.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి