తెలంగాణ రాష్ట్రంలో అధికారంపై కాంగ్రెస్ పార్టీవి పగటి కలలు అని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి అంటున్నారు. బిజినేపల్లి దళిత, గిరిజన ఆత్మగౌరవ సభలో కాంగ్రెస్ నేతల వ్యాఖ్యలపై మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి స్పందించారు. పాలమూరు ఎత్తిపోతల జాప్యానికి కారణం కాంగ్రెస్.. ఆ పార్టీ నాయకులు కేసులు వేసి అడ్డంకులు సృష్టించకుంటే ఈ పాటికే పాలమూరు - రంగారెడ్డి ఎత్తిపోతల పనులు పూర్తయ్యేవని మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి తెలిపారు. ఇప్పటికీ సుప్రీం కోర్టులో కేసులు నడుస్తున్నాయని మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌ రెడ్డి స్పష్టం చేశారు.


తెలంగాణను ఆంధ్రలో కలిపి ఎడారి చేసినందుకు కాంగ్రెస్‌ను గెలిపించాలా...? కలిపిన తెలంగాణను తిరిగి సాధించుకునేందుకు వేల మంది బలిదానాలకు కారణమైనందుకు కాంగ్రెస్‌ను గెలిపించాలా...? అని మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌ రెడ్డి విమర్శించారు. ఉమ్మడి పాలమూరు జిల్లాలో లక్ష ఎకరాలకు సాగు నీళ్లు లేవు... తెలంగాణ వచ్చాక కేసీఆర్ నాయకత్వంలో నేడు 11 లక్షల ఎకరాలకు సాగు నీరందుతుందని మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌ రెడ్డి గుర్తు చేశారు. రేపు పాలమూరు - రంగారెడ్డి ప్రాజెక్టు పూర్తైతే రెండేళ్లలో 23, 24 లక్షల ఎకరాలకు సాగు నీరందుతున్న నిజం ప్రజల కళ్ల ముందు కనిపిస్తుందని మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌ రెడ్డి చెప్పారు.


కాంగ్రెస్ పుణ్యాన 30, 40 వేల రూపాయలకు ఎకరా చొప్పున భూమి రైతులు అమ్ముకున్నారని, నేడు ఎక్కడ చూసినా 20 లక్షల పైమాటేనని మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌ రెడ్డి తెలిపారు. ఉమ్మడి జిల్లాలో 13 లక్షల మంది రైతులు రైతుబంధు పథకం ద్వారా లద్ధిపొందుతున్నారని, దాదాపు 4 లక్షల మందికి ఆసరా ఫించన్లు అందుతున్నాయని మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌ రెడ్డి అన్నారు. కేసీఆర్ కిట్, కళ్యాణలక్ష్మి, న్యూట్రిషన్ కిట్, అమ్మ ఒడి పథకాల అమలు ద్వారా సామాన్యమైన సంతృప్తిగా ఉన్నారని మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌ రెడ్డి స్పష్టం చేశారు.


తెలంగాణ సంక్షేమ పథకాల ఫలాలు ప్రతి ఇంటికీ చేరుతున్నాయి... ప్రజలు అవి ప్రత్యక్ష్యంగా చూస్తున్నారని, ఇవన్నీ గమనిస్తున్న ప్రజలు కోరి కొరివి దయ్యం లాంటి కాంగ్రెస్‌ ఆదరిస్తారా...? అని మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌ రెడ్డి ధ్వజమెత్తారు. జాతీయపార్టీగా కాంగ్రెస్ పార్టీ విఫలమైందని, ప్రతిపక్ష పాత్రలో వైఫల్యమే నేటి భాజపా నియంతృత్వానికి కారణమని మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌ రెడ్డి ఆరోపించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: