వ్యక్తి, ఇంకా వ్యవస్థ ఈ రెండింటిలో ఏది దేనివలన హైలెట్ అవుతుందనే దాని బట్టి, దాని పరిణితి అర్థమవుతుంది. ఎంత చేసినా, తమ వల్ల నిజంగా ఎంత అభివృద్ధి జరిగినా కొంతమంది అది పైకి చెప్పుకోరు. మరి కొంతమంది కాలాన్ని బట్టి మారే పరిణామాలను, అభివృద్ధిని కూడా తమ ఖాతాలోనే వేసుకుని తానే ఒక వ్యవస్థలా అనుకుంటూ ఉంటారు, అలాగే ప్రచారం చేసుకుంటూ ఉంటారు.


ఉదాహరణకు  ప్రధానమంత్రి నరేంద్ర మోడీనే తీసుకుంటే ఆయనెప్పుడూ వ్యవస్థనే హైలెట్ చేస్తారు గాని, తాను హైలైట్ అవ్వాలని అనుకోరు. తాను చేసే పనిలో, పని మాత్రమే కనపడాలి కాని తాను కనపడకపోయినా ఆయన పెద్దగా పట్టించుకోరు. కానీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అయితే తాను చేసిన పనికి, చేయని పనికి కూడా తన ప్రమేయం కొద్దిగా ఉన్నా, అసలు లేకపోయినా ప్రతి పని మీద తన ముద్రను వేసుకోవడానికి ప్రయత్నిస్తారు. అలాగని ఆయన తరపున కొన్ని కొన్ని విషయాల్లో అభివృద్ధి జరిగిందన్న విషయం కూడా వాస్తవమే, అది ఎవరూ కాదనలేని నిజం కూడా.


కానీ కాలానికి అనుగుణంగా సమాజంలో వచ్చే మార్పులను, జరిగే అభివృద్ధిలో కూడా తన ప్రమేయం ఉందని తన వల్లే గొప్ప గొప్ప అభివృద్ధికరమైన  మార్పులు చోటుచేసుకున్నాయని ఆయన చెప్పుకుంటూ ఉంటారు. దానిలో ఎంత నిజం ఉన్నా, లేకపోయినా సరే. ఆ రకంగా చంద్రబాబు నాయుడు గారు ముద్ర వేస్తూ ఉంటారు.


ప్రధానమంత్రి నరేంద్ర మోడీ విషయానికి వస్తే భారతీయ జనతా పార్టీ వచ్చాక ఎన్నో మార్పులు వచ్చాయని, భారతీయ జనతా పార్టీ వల్లే విదేశాంగ విధానం మారిందని, భారతదేశం ఎంతో అభివృద్ధి చెందుతుందని ఆయన తన పేరు లేకుండానే ప్రస్తావిస్తారు. అయితే చంద్రబాబు నాయుడు గారు మాత్రం టెక్నాలజీలో వచ్చిన మార్పుల్లో భాగంగా వచ్చిన మొబైల్ ఫోన్స్, కంప్యూటర్లు ఇలా అన్ని ఆయన వల్లే వచ్చేయని చెప్పుకుంటూ ఉండడం మాత్రం విడ్డూరం.


మరింత సమాచారం తెలుసుకోండి: