
భావి తరాలని నష్ట పోతుంది చైనా అన్న సందేహం వచ్చిన తరువాత, చైనా ఇప్పుడు జనాలని ఇద్దర్ని కనండి, ముగ్గురిని కనండి అంటే ఎవరూ పట్టించుకొనే వాళ్ళు లేరు. ఎందుకంటే ఈ కనే వాళ్ళందరూ ఎక్కువగా అబ్బాయిల్ని కన్నారు . దాంతో అమ్మాయిల డిమాండ్ పెరిగి అబ్బాయిల డిమాండ్ తగ్గింది. అమ్మాయిలు 30-35 సంవత్సరాలు వచ్చినా పెళ్ళిళ్ళు చేసుకోవడం లేదెందుకు అని అడిగితే మమ్మల్ని పోషించడానికి మగాళ్ళ దగ్గర డబ్బు ఉండడం లేదు, ఈ రోజుల్లో పెళ్లి చేసుకున్నాక డబ్బులు ఉండాలి కదా అంటే, దాంతో చైనా తమ చాలా రాష్ట్రాల్లో ప్రోత్సాహకాలను ప్రకటించింది.
తాజాగా చూస్తే హేమమ్ ప్రావిన్స్ లో 2022 నుండి పిల్లల్ని కనమని ప్రోత్సాహిస్తూ ఉంటే కనడానికి మాకు ఉద్యోగాలపరంగా ఖాళీ ఉండడం లేదంటే, ఇప్పుడు అక్కడ కొత్తగా పెళ్లయిన వాళ్లకి 30 రోజులు పెయిడ్ హాలిడేస్ గా ప్రకటించారు. కొన్ని ప్రాంతాల్లో అయితే ముగ్గురు పిల్లల్ని కంటే, ఆ బిడ్డకు 3వ సంవత్సరం వచ్చే వరకూ 500 యువాన్స్ అంటే మన కరెన్సీ రేట్ల ప్రకారం లక్షన్నర వరకు ప్రకటించింది అక్కడ ప్రభుత్వం. ఈ పారితోషికాలు కూడా ప్రాంతాన్ని బట్టి మారుతుంటాయి.