
దాంతో చాలా కంపెనీలు ఇప్పుడు తమ రేట్లు తగ్గించుకుంటున్నాయి. జితేంద్ర యు.వీ.టెక్ తమ మోడల్ మీద 6000 వరకు రాయితీ ఇస్తున్నట్టుగా ప్రకటించింది. టీవీఎస్ మోటార్స్ మార్చినాటికి 25 వేల యూనిట్లు అమ్మాలని ప్రపోజల్ పెట్టుకున్నా అందులో సగమే అవుతుందని ప్రకటించింది. ఈధర్ ఎనర్జీస్ అయితే నెలకు 25000 యూనిట్లు టార్గెట్ పెట్టుకుంటే తొమ్మిది వేలకు మించి అమ్మ లేకపోతున్నామని ప్రకటించింది.
నవంబర్ నాటికి 10లక్షల యూనిట్లు అమ్మాలని వోలా అనుకుంటే కేవలం 17700 యూనిట్లు మాత్రమే అమ్మగలిగింది. ఇప్పటిదాకా. ఒడికినోవా ఆటో టెక్ మీద ప్రభుత్వం ఇచ్చే రాయితీలు నిలిచిపోవడంతో వాహనాల ధరలు పెరిగిపోయాయి. ఫలితంగా విక్రయాలు నెమ్మదించాయి. దీంతో 8750వరకు ప్రయోజనాలు కలిగిస్తున్నట్టుగా ఆ సంస్థ ప్రకటించింది. గ్రీఫ్స్ కాటన్ కు సంబంధించిన ఏంఫియర్ ఇటీవల విడుదల చేసిన ప్రైమస్ మోడల్ పైన 5వేల వరకు క్యాష్ బ్యాక్ ఇస్తుంది.
జితేంద్ర యు.వీ.టెక్ తన మోడల్ పైన 6000 వరకు రాయితీను ఇస్తుంది. ఓలా ఎలక్ట్రిక్ తమ ఎస్1 ప్రోమో ధరను 16000 దాకా తగ్గించింది. లోన్ మీద తీసుకుంటే ఎలాంటి ప్రాసెసింగ్ ఫీజు తీసుకోవడం లేదు. పైగా 0 డౌన్ పేమెంట్ తో వాహనాలని ఇస్తుంది. మోటో కార్స్ మద్దతు ఉన్నటువంటి ఈధర్ ఎనర్జీ తమ వాహనాల మీద 17000 వరకు ప్రయోజనాలు ఇస్తూనే లోన్ మీద తీసుకునే వాళ్ళకి జీరో కాస్ట్ ఈఎంఐ కూడా కల్పిస్తుంది.