
గతంలో ఇలాంటి చోటనే తేడా కొట్టింది. మనం క్రెడిట్ కార్డులు గనక హస్పిటల్స్ లో, వ్యాపార సంస్థల్లో గానీ వారు తీసుకోమని చెబుతారు. కారణం వారికి 2 శాతం ట్యాక్స్ పడుతుంది. ఆ రెండు శాతం ట్యాక్స్ కూడా క్రెడిట్ కార్డు నుంచి తీసుకోవడానికి ఒప్పుకుంటేనే వారు ఆ క్రెడిట్ కార్డును యాక్సెప్ట్ చేస్తున్నారు. లేకపోతే యాక్సెప్ట్ చేయడం లేదు.
కేంద్రం తెచ్చిన ఈ నూతన సవరణ కూడా రేపటి రోజు ఇలాగే తయారవుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. కాబట్టి ఇది రాబోయే రోజుల్లో ప్రజలకు భారంగా మారుతుంది. కేంద్ర ప్రభుత్వం తీవ్ర విమర్శలు ఎదుర్కొంటాయనడం లో ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. మనం ట్రాన్స్ క్షన్ చేసే డబ్బులకు బ్యాంకులు, పేటీఎం ఎందుకు ట్యాక్స్ చెల్లించాలనే కనీసం అవగాహన లేకుండా నిర్ణయాలు తీసుకుంటున్నారు. దీని వల్ల చివరకు యూసర్ కే ఆ ఛార్జీల మోత మోగుతుంది. ఎలాగో బ్యాంకులు, గూగుల్ ఫే, ఫోన్ ఫే, పేటీఎం లాంటి సంస్థలు భారాన్ని భరించవు. కస్టమర్ల మీదనే ఈ అదనపు భారాన్ని మోపుతాయి.