
ఐటీ శాఖ చట్టం ప్రకారం ప్రభుత్వ పరిధిలో వాడే ప్రతీ కంప్యూటర్కు ఆడిట్ జరగాలని.. అమెరికాలో ఐటీ ఉద్యోగం చేసిన కేటీఆర్కు ఫైర్ వాల్స్ అంటే తెలియదా అని వై.ఎస్. షర్మిల ప్రశ్నించారు. ఐపీ అడ్రస్ తెలిస్తే టెర్రరిస్ట్లు కూడా ప్రభుత్వ సిస్టంలను హ్యాక్ చేయొచ్చు అని వై.ఎస్. షర్మిల మండిపడ్డారు. ప్రభుత్వ పరిధిలో వాడుతున్న కంప్యూటర్లకు ఎన్నింటికి భద్రత సర్టిఫికెట్లు ఉన్నాయో బయట పెట్టాలని వై.ఎస్. షర్మిల డిమాండ్ చేశారు.
టీసేవ్ నిరుద్యోగ నిరాహార దీక్ష ఆపాలని పోలీసులు ప్రయత్నించారని అందుకే తనను అరెస్ట్ చేశారని వై.ఎస్. షర్మిల ఆందోళన వ్యక్తంచేశారు. ఇందిరాపార్క్ వద్ద టీ సేవ్ ఆధ్వర్యంలో నిరుద్యోగ నిరాహార దీక్షలో వై.ఎస్. షర్మిల పాల్గొన్నారు. టీసేవ్ దీక్షకు చేస్తామంటే తమకు అనుమతి ఇవ్వలేదని దీంతో కోర్టుకు వెళ్లి అనుమతి తెచ్చుకున్నామని వై.ఎస్. షర్మిల అన్నారు. అయినా దీక్షను ఆపాలని ప్రయత్నాలు చేశారని.. అందుకే తనను అరెస్ట్ చేశారని వై.ఎస్. షర్మిల అన్నారు.
సిట్ ఆఫీస్కు వెళ్తుంటే పోలీసులు అడ్డుకున్నారని.. తన మీద పోలీసులు పడ్డారు కాబట్టే సెల్ఫ్ డిఫెన్స్ కోసం తోయాల్సి వచ్చింది కానీ కొట్టాలని ఉద్దేశం తనకు ఏమాత్రం లేదని వై.ఎస్. షర్మిల అన్నారు. తనను చూసేందుకు వచ్చిన తన తల్లి విజయమ్మను కూడా పోలీసులు అడ్డుకున్నారని వై.ఎస్. షర్మిల అన్నారు. కేసీఆర్ కుటుంబం మొత్తం స్కాంలతో కూరుకుపోయిందని.. కేసీఆర్ వాటర్ స్కాం, బిడ్డ లిక్కర్ స్కాం, కొడుకు టీఎస్పీఎస్సీ పేపర్ స్కాంకు పాల్పడ్డారని వై.ఎస్. షర్మిల ఆరోపించారు.