నారా చంద్రబాబు నాయుడు అరెస్టుతో టీడీపీ పార్టీని ప్రస్తుతం నారా లోకేశ్ నడిపిస్తున్నారు. ప్రస్తుతం జరుగుతున్న అసెంబ్లీ సమావేశాల్లో ఏ విధంగా వ్యవహరించాాలి ఏం మాట్లాడాలి ఎలా ఉండాలనే దానిపై శాసన సభ పక్ష టీడీపీ సమావేశాన్ని లోకేశ్ ఆధ్వర్యంలో నిర్వహించి ఎమ్మెల్యేలకు దిశా నిర్దేశం చేశారు. అలాగే పార్లమెంటరీ పార్టీ సమావేశాల్లో కూడా లోకేశ్ లీడ్ తీసుకుని ఎలా ముందుకెళ్లాలనే విషయాలను చర్చించినట్లు తెలుస్తోంది.


నారా లోకేశ్ టీడీపీలో చంద్రబాబు తర్వాత పార్టీని నడిపిస్తుండడం కలిసొచ్చే అంశమే అయినా చంద్రబాబును అరెస్టు చేసిన తర్వాత కార్యకర్తలకు ధైర్యం చెబుతూ ముందుకు సాగుతున్నారు. చంద్రబాబు అరెస్టు తర్వాత పార్టీ కార్యకర్తలకు ఢీలా పడకుండా రాష్ట్రంలోనే కాకుండా ఇతర రాష్ట్రాల్లో వివిధ దేశాల్లో చంద్రబాబుకు మద్దతుగా ధర్నాలు నిరసలు చేయించడంలో సక్సెస్ అవుతున్నారు.


చంద్రబాబు అరెస్టు కావడంతో దేశంలోని వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ప్రముఖ రాజకీయ నేతలు లోకేశ్ కు ఫోన్ చేసి సంఘీభావం తెలుపుతున్నారు. హర్యానా ముఖ్యమంత్రితో పాటు బీఎస్పీ పార్టీ లోక్ సభ పక్ష నేత లోకేశ్ కు ఫోన్ చేసి వివరాలు అడిగి తెలుసుకున్నారు.  ఎంపీ రితేశ్ పాండా, మహారాష్ట్ర సీఎం లోక్ నాథ్ షిండే లోకేశ్ కు మద్దతు తెలిపారు.


అయితే రాజకీయ కక్షతోనే చంద్రబాబు అరెస్టు చేశారని ఆయనకు తప్పకుండా న్యాయం జరుగుతుందని లోకేశ్ కు పలువురు జాతీయ నేతలు మద్దతు తెలిపినట్లు సమాచారం. ముఖ్యంగా చంద్రబాబు విషయంలో లోకేశ్ ప్రస్తుతం దేశంలోని వివిధ పార్టీల నేతల మద్దతు కూడగడుతున్నారు. ఆంధ్రలోని జగన్ సర్కారు రాజకీయ కక్షలతోనే అక్రమ కేసులో చంద్రబాబును ఇరికించారని తెలియజేస్తున్నారు. దీంతో పాటు రాష్ట్రంలో కార్యకర్తలు చేయాల్సిన కార్యక్రమాలను నిర్ణయిస్తూ ముందుకు సాగుతున్నారు. అయితే లోకేశ్‌ను కూడా అరెస్టు చేస్తారని వార్తలు వస్తున్న నేపథ్యంలో ఇది టీడీపీకి అగ్ని పరీక్ష వంటిదని చెప్పక తప్పదు.


మరింత సమాచారం తెలుసుకోండి: