
దీనికి సంబంధించి పక్కా ప్రణాళికతో బలమైన సాక్ష్యదారాలతో కోర్టులో పెట్టడం వల్ల ఆయనకు 14 రోజుల జైలు శిక్ష పడిన విషయం తెలిసిందే. అయితే జైలు శిక్షణ తగ్గించి ఆయనకు బెయిల్ ఇవ్వడానికి దేశంలోనే అత్యున్నత లాయర్లు అయినటువంటి సిద్ధార్థ లోత్ర, హరీష్ సాల్వే ప్రయత్నాలు ప్రారంభించారు. చంద్రబాబు అరెస్ట్ అయిన మొదటి రోజు నుండి ఇప్పటివరకు వారు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు.
అయితే జగన్ సర్కారు చంద్రబాబుపై స్కిల్ డెవలప్మెంట్ కేసు మాత్రమే కాకుండా గతంలో ఆయనపై ఉన్న వివిధ కేసులను పెడుతోంది. ఒకవేళ స్కిల్ డెవలప్మెంట్ కేసులో బెయిల్ వచ్చే అవకాశం ఉన్న మిగతా కేసులపై విచారించాల్సిందేనని పట్టుబడుతుంది. ఒక కేసులో బెయిలు వచ్చే సమయంలో మరో కేసును పెట్టి అందులో విచారణకు అనుమతించాలని ఏసీబీ సిఐడి లాంటివి పట్టుబడుతున్నాయి. కాబట్టి కోర్టు దానికి అంగీకరించక తప్పడం లేదు. ఇంతటి సీనియర్లు లాయర్లు ఉన్నప్పటికీ కూడా ఏమీ చేయలేకపోతున్నారు.
సుప్రీంకోర్టులో మహా మహా కేసులను వాదించినటువంటి హరీష్ సాల్వే, సిద్ధార్థ లోత్ర లాంటివారు ఏమి చేయలేక నిస్సహాయ స్థితిలో వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్నారు. సిద్దార్థ మాట్లాడుతూ న్యాయం జరగనప్పుడు కత్తి పట్టడమే మేలని అంటే హరీష్ సాల్వే మాట్లాడుతూ ఇదొక నాన్సెన్స్ కేసు అని తన నిస్సహాయతను వ్యక్తం చేశారు. అంటే చంద్రబాబు నాయుడు పై ఖచ్చితంగా కక్ష సాధింపు జరుగుతుందని చెప్పకనే చెప్పారు. ఇంతటి ఉద్దండులకే సాధ్యం కాకపోతే బెయిల్ పై బాబు బయటకు రావడం కష్టమే.