ఆంధ్రాలో ఎన్నికల సంరంభానికి ఇక ఎంతో కాలం లేదు. అయితే  2019 ఎలక్షన్స్ లో భారీ విజయం సాధించిన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీఎలక్షన్స్ లో కూడా తన సత్తాను చూపించడానికి ప్రయత్నిస్తుంది. ఇప్పటికే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీపై చాలా వరకు వ్యతిరేకత పెరుగుతుందని అంటున్నారు కొంత మంది. ప్రభుత్వ ఉద్యోగులు, పోలీస్ డిపార్ట్మెంట్ ఇలా చాలా రంగాల్లో ప్రజలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీపై విముఖత  చూపిస్తున్నారని అంటున్నారు.


ఇప్పుడు ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పటి నుండే ప్రజల్లోకి మమేకం అవ్వాలని ప్లాన్స్ వేస్తుంది. ప్రతిపక్షాల వ్యతిరేక ప్రచారాన్ని పట్టించుకోకుండా తాము చేసిన మంచి పనులను ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్లాలని నిర్ణయించుకున్నారు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు. ఈ విధంగా వైయస్ జగన్మోహన్ రెడ్డి  శాసన సభ  సభ్యులకు, అలాగే నియోజకవర్గ ఇన్చార్జులకు ప్రణాళికను ప్రిపేరు చేశారని అంటున్నారు.


రాబోయే రెండు నెలలు చాలా కీలకమని కాబట్టి ఈ రెండు నెలల్లో ప్రతినెల ఆ నెలలోనే ఎలక్షన్స్ జరుగుతున్నట్లుగా ప్రిపేర్ అవ్వాలని జగన్మోహన్ రెడ్డి చెప్పడం జరిగింది. జగనన్న సురక్ష పథకం కింద ఇంటింటికి డాక్టర్ అనే విధానం వల్ల ప్రజలకు ఎంతో మేలు జరుగుతుందని, ఆ విషయాన్ని ప్రజల్లోకి తీసుకు వెళ్లాలని ఆయన అన్నారట. ఇంటింటికి డాక్టర్ అనే ఈ విధానం ద్వారా పల్లె ప్రాంతాల్లోని ప్రజలకు, అలాగే మారుమూల ప్రాంతాలలోని  ప్రజలకు కూడా వైద్య సేవలు అందుతున్నాయి.


ఇవి ఇంటికే అందుబాటులోకి వస్తాయనే విషయాన్ని తిరిగి బలంగా చెప్పాలని ఆయన అన్నారు.‌ సీట్లు కేటాయించడం అనేది జనవరి నాటికి కంప్లీట్ అవుతుందట. అయితే ఈసారి కూడా సిట్టింగ్ అభ్యర్థులకే ప్రాముఖ్యత ఇవ్వనున్నారని తెలుస్తుంది. జనవరి నాటికి ఎవరెవరికి సీట్లు రాబోతున్నాయో ఆ అభ్యర్థుల పేర్లు ఖరారు అయిపోతాయని అంటున్నారు ఒక వేళ సీట్లు రాని వాళ్ళని కూడా తమ మనుషులుగానే చూసుకుంటామని హామీ ఇస్తుంది వైసిపి.


మరింత సమాచారం తెలుసుకోండి: