మనకి తెలియని అంశం గురించి ఎవరూ ఏం చెప్పినా నమ్మేస్తాం. వారు చెప్పిన దానికి తలాడిస్తాం. అలాగే అభివృద్ధి విషయంలో కూడా ప్రభుత్వాలు జరిగింది అంటే జరిగినట్లు.. ప్రతిపక్షాలు జరగలేదు అని ఆరోపిస్తే జరగనట్లు మనం వింటూ ఉంటాం. మన ఆలోచన విధానాన్ని రాజకీయ నాయకులు నిర్దేశిస్తున్నారు. మనకంటూ ఓ విధానం అనేది లేకుండా చేస్తున్నారు.


వాస్తవానికి నిజమైన అభివృద్ధి లెక్కలు రిజర్వ్ బ్యాంకు గణాంకాలు చెబుతుంటాయి. లేకపోతే ఐక్యరాజ్య సమితి లెక్కలు చెబుతుంటాయి. మనం అభివృద్ధి చెందామో.. లేక వెనుకబడ్డామో చెప్పడానికి ఈ గణాంకాలే నిదర్శనం. అంతేకానీ మన నాయకులు చెప్పింది కాదు. తాజాగా ఐక్యారాజ్యసమితి భారత్ పై ప్రశంసలు కురిపించింది. భారత్ లో మనషుల సగటు ఆయుర్ధాయం పెరుగుతోంది. ఐరాస మానవాభివృద్ధి సూచి, హెచ్ డీఐ నివేదిక ఈ విషయాన్ని వెల్లడించింది. ఆయుర్ధాయంతో పాటు స్థూల జాతీయాదాయం 6951 డాలర్లకు పైగా పెరిగింది.


గడిచిన 12 నెలల్లో 6.3శాతం పెరిగిందని ఐరాస నివేదిక స్పష్టం చేసింది. 2002లో భారత్ 0.644 హెచ్ డీ ఐ స్కోరును కలిగిం ఉంది. మానవాభివృద్ధి సూచీలో భారత్ ర్యాంకు 134గా ఉంది. 2021లో 191మ దేశాల్లో ఇండియా ర్యాంకు 135గా ఉండగా.. 2022లో ఒక స్థానం తగ్గి 134కి చేరుకుంది. లింగ అసమానన సూచిక 2002లో భారత్ 0.437స్కోర్ తో 193 దేశాల్లో 108వ స్థానంలో నిలిచింది.


2021లో 0.490 స్కోర్ తో 191 దేశాల్లో 122వ స్థానంలో ఉంది. సంపన్న దేశాల రికార్డు స్థాయిలో మానవాభివృద్ధి సాధించగా.. పేదల్లో సగం మంది ప్రగతి స్థాయి కంటే దిగువనే ఉన్నారని నివేదిక వెల్లడించింది. అంతేకాకుండా అసమానతలను తగ్గించడంలో  భారత్ పురోగతి సాధించింది. దేశం జీడీపీ విలువ 0.437గా ఉందని, ప్రపంచ, దక్షిణాసియా సగటుల కంటే ఇది మెరుగేనని నివేదిక వెల్లడించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: