
గత ఏడాది జరిగిన ఎన్నికల్లో జనసేన నాయకురాలు లోకం మాధవి ఇక్కడ విజయం దక్కించుకున్నారు. టీడీపీ సీనియర్ నాయకుడు టికెట్‌ను వదులుకుని మరీ.. మాధవి కోసం కష్టించారు. అయితే.. ఇక్కడ పి ఠాపురంలో ఉన్న పరిస్థితికి మించిన పరిస్థితులు ఉన్నాయని తమ్ముళ్లు బహిరంగ వ్యాఖ్యలే చేస్తున్నారు. `మేం ఇక్కడ ద్వితీయ శ్రేణి పౌరులుగా పడిఉన్నాం. మాకు ఒక్క మాట చెప్పరు. మా మాట అసలే పట్టించుకోరు. ఏం చేయాలి..?` ఇదీ.. మాజీ ఎమ్మెల్యే పతివాడ అనుచరులు వాపోతున్నారు.
అసలు ఏం జరుగుతోందన్నది చూస్తే.. గత ఎన్నికల్లో విజయం తర్వాత.. లోకం మాధవి దూకుడుగా ముం దుకుసాగారు. టీడీపీ నాయకులను టార్గెట్ చేసుకుని.. వ్యవహరించారన్న విమర్శలు వచ్చాయి. ఇదే సమయంలో తనకు చెప్పే అన్నీ చేయాలని.. తన అనుమతి లేకుండా ఏ చిన్న పని కూడా చేయడానికి వీల్లేదని భీష్మించారు. అంతేకాదు.. ఇరు పక్షాల మధ్య మాటల యుద్ధం కూడా జరిగింది. పోలీసులు ఎంట్రీ.. టీడీపీ కార్యకర్తలపై దాడులు ఇవన్నీ కామన్ అయ్యాయి.
ఆ తర్వాత కొన్నాళ్లకు పెద్దల జోక్యంతో స్వల్ప మార్పు కనిపించింది. కానీ, కలుపుగోలు తనం లేదు. తా ను వస్తున్న సమాచారం కూడా ఇవ్వకుండా.. టీడీపీకి బలమైన మండలాల్లోనూ.. ఆమె వస్తుండడం.. తమ కు సమాచారం ఇవ్వకుండానే ప్రారంభాలు చేస్తుండడంతో లోకం తీరుపై ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. `మేం ఇక్కడ కొన్ని దశాబ్దాలుగా ఉన్నాం. పార్టీ కోసం పనిచేస్తున్నా.. మాకు కనీసం సమాచారం లేదు.` అని జనసేనలోని మరో వర్గం చెబుతోంది. మొత్తంగా అటు సొంత పార్టీలోనూ.. ఇటు కూటమి పార్టీలోనూ.. సఖ్యత లేని రాజకీయాలు చేస్తూ.. తనదైన లోకంలో విహరిస్తున్నారట.. ఈ లేడీ ఎమ్మెల్యే.!!
ఈ వాట్సాప్ నెంబర్‌కు మీ జిల్లాలో రాజకీయ, సామాజిక సమస్యలు వివరాలు పంపండి..
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు