- ( అమ‌రావ‌తి - ఇండియా హెరాల్డ్ ) . . .

ఈసారి కాలం కలిసి వచ్చి వైసిపి అధికారంలోకి వస్తే తిరిగి వ‌లంటీర్లను తీసుకుంటారా ? వైసిపి నియమించిన వాలంటీర్ల ను కూట‌మి ప్ర‌భుత్వం తొలగించిన నేపథ్యంలో వారికి తిరిగి ఉపశమనం కలిగిస్తారా ? అంటే నో అన్న ఆన్సర్లు వినిపిస్తున్నాయి. వాలంటీర్లు కార‌ణం గానే తాము ఎన్నిక‌ల్లో ఓడి పోయమని .. వారి కారణంగానే ప్రజలకు నాయకులు మధ్య సంబంధాలు తెగిపోయాయని వైసీపీ నాయకులు పదేపదే చెప్తున్నారు. తాజా గా పల్నాడు జిల్లా నరసరావుపేట మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి కూడా ఇదే అభిప్రాయం వ్యక్తం చేశారు. వైసీపీ నాయకులు వాలంటీర్ల విషయంలో ఏమాత్రం సానుభూతి చూపించడం లేదు. పైగా వాలంటీర్లకు తగిన శాస్తి జరిగిందని వైసిపి నాయకులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇదే విషయాన్ని పలువురు నేత‌లు పార్టీ సమావేశాలలో చెబుతున్నారు. జగన్ వాలంటీర్లకు ప్రాధాన్యం ఇవ్వడంతో పార్టీ కార్యకర్తలు .. ఎమ్మెల్యేలతో సంబంధం లేకుండా ప్రభుత్వ పథకాలు అన్ని నేరుగా ప్రజలకు వెళ్లాయి.


ఇది అంతిమంగా పార్టీ నాయకులు .. కార్యకర్తలకు ప్రజలకు మధ్య ఉన్న అవినాభావ సంబంధాన్ని తేల్చేసింది. ఎప్పుడు అయితే కార్యకర్తలకు ప్రజలకు మధ్య దూరం పెరిగిపోయిందో ? కార్యకర్తలకు వైసీపీలో విలువ లేకుండా పోయింది. ఇది అంతిమంగా గత ఎన్నికలలో కార్యకర్తలు వైసిపి విజయం కోసం పనిచేయలేదు. ఫలితంగా వైసిపి ఘోరంగా పడిపోయి కేవలం 11 సీట్లకే పరిమితం అయింది. ఎట్టి పరిస్థితుల్లోనూ కార్యకర్తలకు మాత్రమే ప్రాధాన్యం ఇవ్వాలని మాజీ మంత్రులు పేర్ని నాని - కొడాలి నాని కూడా చెప్తున్నారు. ఏది ఏమైనా వైసీపీలో వాలంటీర్లు శ‌కం ముగిసినట్టే కనిపిస్తోంది.


వాట్సాప్ నెంబ‌ర్‌కు మీ జిల్లాలో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి..

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.

నోట్ :  వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు

మరింత సమాచారం తెలుసుకోండి: