తెలంగాణ రాజధాని గ్రేటర్ హైదరాబాద్లోని జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నికల ఫలితాలు ఈరోజు వెల్లడి అయ్యాయి. అధికార కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసిన నవీన్ యాదవ్ ఘనవిజయం సాధించారు. నవీన్ యాదవ్ కు ఏకంగా 25 వేల ఓట్ల భారీ మెజార్టీ వచ్చింది. ఇది ఇలా ఉంటే తెలంగాణ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి బాధ్యతలు చేపట్టాక జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలలో విజయంతో హ్యాట్రిక్ విజయాలు సాధించినట్లు అయింది. రేవంత్ ముఖ్యమంత్రి అయిన ఆరు నెలలకే జరిగిన పార్లమెంటు ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ 8 ఎంపీ సీట్లు సాధించి తన పట్టు నిలుపుకుంది. మరీ ముఖ్యంగా తెలంగాణలో బిజెపితో సమానంగా కాంగ్రెస్ పార్టీకి ఎనిమిది పార్లమెంటు స్థానాలు రాగా .. బీఆర్ఎస్ కు ఒక్క సీటు కూడా దక్కలేదు. పార్లమెంటు ఎన్నికలలో రేవంత్ ఎనిమిది సీట్లు గెలిపించుకుని తన పట్టు సాధించారు.
అలాగే తర్వాత కంటోన్మెంట్ ఉప ఎన్నికలలో కాంగ్రెస్ విజయం సాధించింది. అక్కడ బిఆర్ఎస్ ఎమ్మెల్యే రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో జరిగిన ఉప ఎన్నికలలో రేవంత్ కాంగ్రెస్ అభ్యర్థిని పోటీలో పెట్టి గెలిపించుకున్నారు. అలా కంటోన్మెంట్లో బిఆర్ఎస్ సిట్టింగ్ సీటును కాంగ్రెస్‌ను గెలిపించిన రేవంత్ రెడ్డి తాజాగా జూబ్లీహిల్స్ లోను బీఆర్ఎస్ సిట్టింగ్ సీటును కాంగ్రెస్ ఖాతాలో వేశారు. జూబ్లీహిల్స్ గెలుపుతో రేవంత్ రెడ్డి ఇమేజ్ రాష్ట్రంలోనూ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం దగ్గర పెరిగిందనే చెప్పాలి. అలాగే పిసిసి అధ్యక్షుడు మహేష్ గౌడ్ కు బాధ్యతలు చేపట్టిన తర్వాత ఇది తొలి విజయం కావడం విశేషం. ఏది ఏమైనా రేవంత్ రెడ్డి లోక్సభ ఎన్నికలలోను అటు కంటోన్మెంట్ ఉప ఎన్నికలలో తాజాగా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలలో కాంగ్రెస్ను గెలిపించి తన క్రేజ్ నిలుపుకున్నారు.
ఈ వాట్సాప్ నెంబర్‌కు మీ జిల్లాలో రాజకీయ, సామాజిక సమస్యలు వివరాలు పంపండి..
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి